BigTV English
Advertisement

Allu Arjun: మెగాస్టార్ ని మర్చిపోవడమే కాదు, ఇప్పుడు తెలంగాణ సీఎం పేరు మర్చిపోయిన అల్లు అర్జున్

Allu Arjun: మెగాస్టార్ ని మర్చిపోవడమే కాదు, ఇప్పుడు తెలంగాణ సీఎం పేరు మర్చిపోయిన అల్లు అర్జున్

Allu Arjun: ఒక గొప్ప సినిమా తీయడం ఎంత ముఖ్యమో ఆ గొప్ప సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లడం కూడా అంతే గొప్ప విషయం. ఒక సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లడానికి విపరీతమైన పబ్లిసిటీ చేస్తే మాత్రం సరిపోదు. ఆ సినిమాకి కొంత ప్రభుత్వ సపోర్ట్ కూడా ఉండాలి. ఒక సినిమాకి ప్రభుత్వం కరెక్ట్ గా సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో అనడానికి నిదర్శనం పుష్ప 2 సినిమా. ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్ లోనూ సినిమాకి అద్భుతమైన టికెట్ రేట్లు ఇచ్చారు. కేవలం మంచి టికెట్ రేట్లు ఇవ్వడం మాత్రమే కాకుండా అంత పెద్ద భారీ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకునే అవకాశం కూడా దక్కింది అంటే దానికి కారణం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పాలి. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కూడా ఈవెంట్ జరుగుతుందో లేదో అన్న ఆలోచన చాలా మందిలో మొదలైంది. అయినా కూడా తెలంగాణ ప్రభుత్వ సపోర్టు వల్లనే, అలానే పోలీస్ డిపార్ట్మెంట్ చేసిన పనితీరు వాళ్ళని పుష్ప ఈవెంట్ సక్రమంగా జరిగింది.


ఇకపోతే అవసరం తీరిపోయిన తర్వాత ఆ అవసరాన్ని తీర్చిన వ్యక్తిని మర్చిపోయినట్లు ఉంది అల్లు అర్జున్ ప్రవర్తించిన తీరు. ముఖ్యంగా అల్లు అర్జున్ విషయంలో నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ నేడు మెగా ఫ్యామిలీ ని పక్కన పెట్టేసిన విషయం చాలా సార్లు ప్రేక్షకులకు అర్థమవుతుంది. అంతేకాకుండా నాకు నా ఫ్యాన్స్ అంటే పిచ్చి అబ్బా, నాకు ఆర్మీ ఉంది అని, మనది మనం కాకుండా నీ,నా అని మాట్లాడ్డం మొదలుపెట్టాడు అల్లు అర్జున్. ఇకపోతే కొన్ని సందర్భాల్లో అల్లు అర్జున్ మాట్లాడే కొన్ని మాటల్లో తన క్యారెక్టర్ కూడా బయటపడుతూ ఉంటుంది. రీసెంట్ గా రేవతి చనిపోయిన విషయంలో కూడా మేము పుష్ప సినిమా సెలబ్రేషన్ కూడా మనస్ఫూర్తిగా చేసుకోలేకపోయాం అంటూ చెప్పుకొచ్చారు.

కానీ ఆ సెలబ్రేషన్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ తాజాగా నిర్వహించింది చిత్ర యూనిట్. దీనిలో అల్లు అర్జున్ మాట్లాడుతూ మాకు సపోర్ట్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి థాంక్యూ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి పేరును అమాంతం మర్చిపోయాడు అల్లు అర్జున్. కేవలం మర్చిపోవడమే కాకుండా ఇంకేదో కవర్ చేసే స్టంట్ కూడా వేసి మంచినీళ్లు తాగాడు. ఇక సీఎం రేవంత్ రెడ్డి విషయానికి వస్తే కళా రంగానికి ఆయన ఎంత వాల్యూ ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్గా గద్దర్ పేరు మీద కూడా అవార్డులు ఇచ్చినప్పుడు ఆయనపై తీవ్రమైన ప్రశంసలు వచ్చాయి. ఇక తెలుగు సినిమాకి తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న సపోర్ట్ కూడా అదే స్థాయిలో ఉంది. ఈ తరుణంలో అంతటి పెద్ద వ్యక్తుల్ని మర్చిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మిగతా హీరోలు అయినా కూడా జాగ్రత్త చర్యలు తీసుకొని సినిమాకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.


Also Read : Allu Arjun: టికెట్ రేట్స్ పెంచేసరికి కళ్యాణ్ బాబాయ్ అయ్యాడా.. బన్నీ బాబు

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×