BigTV English

Allu Arjun: టికెట్ రేట్స్ పెంచేసరికి కళ్యాణ్ బాబాయ్ అయ్యాడా.. బన్నీ బాబు

Allu Arjun: టికెట్ రేట్స్ పెంచేసరికి కళ్యాణ్ బాబాయ్ అయ్యాడా.. బన్నీ బాబు

Allu Arjun:  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో  వచ్చిన చిత్రం పుష్ప 2. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మిక నటించింది. ఎన్నో అంచనాల మధ్య పుష్ప 2.. డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ప్రీమియర్ షోస్ నుంచి మిక్స్డ్ టాక్ అందుకుంటూ వచ్చిన ఈ సినిమా.. ఉన్నాకొద్దీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటుంది. అయితే కొంతమంది మాత్రం ఇందులో కథ లేదని చెప్పుకొస్తున్నారు.ఇంకొంతమంది  బన్నీ నటనకు ఫిదా అయ్యామని చెప్పుకొస్తున్నారు.


ఇక సినిమా టాక్ ఎలా ఉన్నా కూడా కలక్షన్స్ లో మాత్రం తుక్కు రేగొట్టింది. ఒక్కరోజులోనే రూ. 275 కోట్లు రాబట్టి బాహుబలి రికార్డ్ ను తిరగరాసిందని చెప్పుకొస్తున్నారు. ఇక్కడే కాకుండా నార్త్ లో పుష్ప 2 సృష్టించిన చరిత్ర అంతా ఇంతా కాదు.  బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా కొట్టలేని  రికార్డ్ను బన్నీ కొట్టి చూపించాడు. నార్త్ లోనే మొదటి రోజు.. రూ. 72 కోట్లు కొల్లగొట్టి ఐకాన్ స్టార్ అనిపించుకున్నాడు. ఇక పుష్ప 2 సక్సెస్ కావడంతో నేడు మేకర్స్ సక్సెస్ మీట్ ను నిర్వహించారు.

Pragya Nagra: ప్రైవేట్ వీడియో లీక్.. స్పందించిన హీరోయిన్


ఇక ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ స్పీచ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అందుకు కారణం.. బన్నీ.. పవన్ కళ్యాణ్ ను బాబాయ్ అని పిలవడమే. ” పుష్ప 2 ను ఇంత సక్సెస్ చేసినా ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ . ఈరోజు నేను థ్యాంక్స్  చెప్పడం తప్ప ఏమి చేయలేను. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, మమ్మల్ని నమ్మిన నిర్మాతలకు మరొకసారి థాంక్స్  చెప్తున్నాను. ఇక ప్రతి సినిమాకు హిట్ ఇచ్చే వ్యక్తి డైరెక్టర్. ఈరోజు ఇక్కడ ఉన్నవారందరికి పేరు వచ్చింది అన్నా.. నా నటన బావుంది అన్నా ఇదంతా కేవలం సుకుమార్ వలనే సాధ్యమైంది. నన్ను ఆకాశంలో కుర్చోపెట్టావు. నేను ఇది అహంకారంతో చెప్పడం లేదు.. మనస్ఫూర్తిగా చెప్తున్నాను.

మొదటి రోజు కలక్షన్స్ రూ. 275 కోట్లు వచ్చాయట. నంబర్స్ గురించి పక్కన పెడితే.. కేవలం ఫ్యాన్స్ ప్రేమనే నాకు ముఖ్యం. ఇదంతా మీరు ఇచ్చిందే. ఈరోజు నేను అందరికిఈ థ్యాంక్స్ చెప్పడం తప్ప ఏది చెప్పలేను. ముఖ్యంగా పుష్ప 2 సినిమా రిలీజ్ కు సహకరించిన ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి స్పెషల్ చెప్తున్నాను. మా సినిమాకు టికెట్ రేట్లు పెంచినందుకు మీకు ధన్యవాదాలు.

Bold Movie In OTT : ఓటీటీలోకి వచ్చేసిన బో** మూవీ.. రొమాంటిక్ సీన్స్ చూస్తే ఇక అంతే..

అలాగే ఏపీలో కూడా  మమ్మల్ని సపోర్ట్ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి.. టికెట్ రేట్స్ పెంచుతూ స్పెషల్ జీవో పాస్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ గా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పర్సనల్ గా కళ్యాణ్ బాబాయ్.. థ్యాంక్స్. మీరు స్పందించిన తీరు నా మనసును హత్తుకుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక మిగతా స్పీచ్ మొత్తాన్ని పక్కన పెడితే .. బన్నీ.. కళ్యాణ్ బాబాయ్ అని పిలవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఎలక్షన్స్  సమయంలో పవన్ కు మద్దతు ఇవ్వకుండా ఫ్రెండ్ కు ఇచ్చిన మాట అని వైసీపీ నేతకు సపోర్ట్ గా నిలబడ్డాడు బన్నీ.  అది కేవలం స్నేహం కోసం చేశాను  అని చెప్పినా.. మెగా ఫ్యాన్స్ మాత్రం బన్నీపై పగ పట్టేశారు. ఆ ఇన్సిడెంట్ తరువాత బన్నీ.. కనీసం పవన్ ను కలిసింది కూడా లేదు.

Akkineni Naga Chaitanya: నా కొడుకును రేస్ ట్రాక్ కు తీసుకెళ్తా.. పిల్లల గురించి చై కామెంట్స్ వైరల్

ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ను గారు అని సంబోధించిన బన్నీ.. ఇప్పుడు తన సినిమా టికెట్ రేట్లు పెంచడంతో బాబాయ్ అయ్యాడా.. ? అని మెగా ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తున్నారు. మరి ఈ బాబాయ్ అంతకు ముందు ఏమయ్యాడు.. ? అంటే ఇప్పుడు నీకు  అవసరమయ్యాడు కాబట్టి పిలిచావా.. ? లేక మెగా ఫ్యాన్స్ మళ్లీ రావాలని, ఆ గొడవను ఆపేద్దామని పిలిచావా.. ? అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక బన్నీ మాటతో అల్లు – మెగా గొడవలు తగ్గుతాయా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×