BigTV English

Star Heroine : ‘నీ జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవు.. మళ్లీ తిరిగొస్తావుగా’.. అసలు ఏమైంది ?

Star Heroine : ‘నీ జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవు.. మళ్లీ తిరిగొస్తావుగా’.. అసలు ఏమైంది ?

Nikki Galrani : ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న సినీ జంటలు జీవితాంతం కలిసి ఉంటారని నమ్మకాలు లేవని చెప్పాలి. నిన్న కాక మొన్న ప్రేమించి పెళ్లి చేసుకున్న కపుల్స్ అందరికి షాక్ ఇస్తూ మేము విడిపోయాము అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ మధ్య సెలబ్రేటిలు ఎవరు ఎప్పుడు విడాకులు ప్రకటిస్తారో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇక ఈ మధ్య కొందరు జంటలు విడిపోయాక మేము విడిపోయాము అని సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ అందరిని ఆలోచించేలా చేస్తుంది.. ఎమోషనల్ అవుతూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అసలు ఏమైందో వివరంగా తెలుసుకుందాం..


టాలీవుడ్ హీరోయిన్ నిక్కీ గల్రానీల ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. నిక్కీ ప్రాణంగా పెంచుకునే పెంపుడు కుక్క చనిపోయింది. బిడ్డలాగా చూసుకుంటున్న కుక్క చనిపోవడంతో ఆమె దుఃఖంలో మునిగిపోయింది. ఎన్నో ఏళ్లుగా ప్రాణంగా పెంచుకున్న ఛాంపియన్ ఇక లేదంటూ సోషల్‌ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్త పరిచింది నిక్కీ. వివిధ సందర్భాల్లో తన పెట్ డాగ్ తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసుకున్న ఆమె.. ‘నీ కాలి ముద్రలు మా మనసుపై స్థిరంగా ఉన్నాయి. అవి ఎప్పటికీ చెరిగిపోవు. మై బేబీ, నీ ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నాను. నువ్వు ఎప్పటికీ మంచి అబ్బాయివే.. నువ్వు తొమ్మిదేళ్లుగా మాతో ఉన్నావ్. ఎప్పుడూ ఎవరినీ గాయపర్చలేదు. కుక్కలంటే భయపడేవాళ్లు కూడా నిన్ను చూసి ప్రేమలో పడ్డారు. ఆ భయాన్ని వదిలేశారు. అందరితోనూ అంత ఫ్రెండ్లీగా, ప్రేమగా మెలిగావ్. నువ్వు మాకు దూరమైనందుకు చాలా బాధగా ఉంది. మరోసారి కలుసుకుందాం.. ఏదో ఒకరోజు ఏదో ఒకరూపంలో మళ్లీ మా దగ్గరకు తిరిగొచ్చేస్తావని ఆశిస్తున్నా’ అని ప్రేమతో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హీరో ఆది పినిశెట్టి గురించి అందరికి తెలుసు.. ఆయన ఎన్నో సినిమాల్లో హీరోగా విలన్ గా చేసి మెప్పించాడు. ఆయన భార్య నిక్కీ గల్రానీ కూడా పలు కన్నడ, తమిళ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. బుజ్జిగాడు మూవీలో సెకెండ్ హీరోయిన్ గా నటించిన సంజనా గల్రానీకి ఈమె సోదరి అవుతుంది. ఇక నిక్కీ, ఆది పలు సినిమాల్లో కలిసి నటించారు. ఈక్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకొని వెళ్లారు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×