BigTV English

Pushpa2 Collections : పుష్ప రాజ్ ఎక్కడా తగ్గేదేలే.. డేంజర్లో బాహుబలి 2 రికార్డు..

Pushpa2 Collections :  పుష్ప రాజ్ ఎక్కడా తగ్గేదేలే.. డేంజర్లో బాహుబలి 2 రికార్డు..

Pushpa2 Collections : అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుంది. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తుంది. సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా రికార్డులను సొంతం చేసుకుంటుంది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన ఘటన కేసు ఎదుర్కొంటూనే ఉండగా.. అతని సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూనే వెళ్తోంది.. అల్లు అర్జున్ చుట్టు వివాదాలు పొంచి ఉన్నా సినిమా టాక్ మారలేదు. అలాగే కలెక్షన్స్ తగ్గలేదు. కేవలం ఆరు రోజుల్లోనే బాక్సాఫీస్ ను షేక్ చేసేలా 1000 కోట్లను రాబట్టింది.. ఇక మూడు వారాలు అవుతున్న కూడా కలెక్షన్స్ తగ్గలేదు. డిసెంబర్ 25నాటికి 21 రోజుల్లోనే రూ.1700 కోట్ల మార్క్ దాటింది. అత్యంత వేగంగా ఈ మార్క్ దాటిన ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించింది..


అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో గతంలో వచ్చిన పుష్ప మూవీ వచ్చింది.. ఆ మూవీ నేషనల్ వైడ్ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఆ మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 మూవీ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర అసలు బ్రేకులు లేని బండిలా దూసుకెళ్తోంది. ఈ సినిమా 21 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1705 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్ గురువారం సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ప్రభాస్ బాహుబలి 2 ప్రపంచవ్యాప్త కలెక్షన్ల రికార్డుకు పుష్ప 2 మరింత చేరువైంది.. ఇక ఈ మూవీ 2 వేల కోట్లకు పైగా వసూల్ చేసేలా కనిపిస్తుంది.. బాలీవుడ్ మూవీ దంగల్ రికార్డులను బ్రేక్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తూనే ఉంది. పుష్ప 2 ది రూల్ రూ.1700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఫాస్టెస్ట్ ఇండియన్ మూవీ. 21 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1705 కోట్లు వచ్చాయి అని మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది. ఇక ఈరోజుతో మరో రికార్డు బ్రేక్ చెయ్యనుందని వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి బాహుబలి 2 మూవీ వరల్డ్ వైడ్ గా రూ.1788 కోట్లు వసూలు చేసింది.. కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తున్న ఈ మూవీ పై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పుష్ప 2 సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నానని ఈ మధ్యే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన అల్లు అర్జున్ ను సంధ్య థియేటర్ కేసు ఇంకా వీడలేదు. ఈ ఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి మొదట రూ.25 లక్షలు అనౌన్స్ చేశారు. ఇప్పుడేమో మరో రూ. 75 లక్షలు మొత్తం కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు బన్నీ చెప్పాడు. మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షలు, సుకుమార్ మరో రూ.50 లక్షలు ఇవ్వడంతో మొత్తంగా రూ.2 కోట్లు అందినట్లయింది.. ఇక అల్లు అర్జున్ ను రీసెంట్ గా విచారించారు పోలీసులు.


ఇక నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో వాళ్లు రేవంత్ తో భేటీ అయ్యారు. ఆ మీటింగ్ లో ఏం మాట్లాడారనే దానిపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×