Pushpa 2: థియేటర్ల యాజమాన్యం వల్ల అప్పుడప్పుడు పొరపాట్లు జరగడం చాలా కామన్. ఒక సినిమా స్క్రీనింగ్ చేయాల్సింది మరొక స్క్రీనింగ్ చేసిన సందర్భాలు మనం తరచుగా చూస్తూనే ఉంటాం. తాజాగా జైపూర్‌లో కూడా అలాగే జరిగింది. దాదాపు మూడు వారాల క్రితం విడుదలయిన ‘పుష్ప 2’ సినిమా ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది. నార్త్‌లో కూడా పుష్పగాడి హవా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఈ సినిమాకు పోటీగా వరుణ్ ధావన్ హీరోగా నటించిన ‘బేబి జాన్’ విడుదలయ్యింది. ‘బేబి జాన్’ సినిమా ఎవరూ చూడడం లేదనో ఏమో థియేటర్ యాజమాన్యం చేసిన పనికి ప్రేక్షకులు ఆశ్చర్యపోయి థియేటర్ నుండి బయటికి వచ్చేశారు.
సమాచారం ఇవ్వకుండానే
ఇటీవల జైపూర్‌లోని ఒక థియేటర్‌లో ‘పుష్ప 2’ (Pushpa 2) మార్నింగ్ షో చూడడానికి ప్రేక్షకులు వచ్చారు. వారు థియేటర్‌లోకి వెళ్లి కూర్చున్న తర్వాత ‘పుష్ప 2’ కాకుండా ‘బేబి జాన్’ సినిమా మొదలయ్యింది. అయితే ‘పుష్ప 2’ షోను క్యాన్సెల్ చేశామని చెప్పకుండా నేరుగా వారికి ‘బేబి జాన్’ సినిమా చూపించిందట థియేటర్ యాజమాన్యం. వారు ఎన్నోరోజుల ముందు టికెట్లు బుక్ చేసుకున్నా కూడా ఈ విషయం వారికి చెప్పలేదని వాపోయారు. టికెట్స్ క్యాన్సెస్ చేయకుండా, రిఫండ్ ఇవ్వకుండా ఇలా వేరే సినిమా చూపించడం కరెక్ట్ కాదని థియేటర్ నుండి ప్రేక్షకులు బయటికి వచ్చేశారు. సోషల్ మీడియా వేదికగా దీనిపై స్పందించారు.
Also Read: వరుణ్ ధావన్ ‘బేబి జాన్’కు డిశాస్టర్ టాక్.. ఆందోళనలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
నిర్మాతల నిర్ణయం
ప్రేక్షకులకు జరిగిన అన్యాయం గురించి థియేటర్ యాజమాన్యం సైతం స్పందించింది. అలా చెప్పకుండా సినిమాను మార్చడం అనేది నిర్మాతల నిర్ణయం అని, తమ చేతుల్లో ఏమీ లేదని చేతులెత్తేసింది. ఈ వివరణ ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. కనీసం షో క్యాన్సెల్ అయిన విషయాన్ని ముందుగానే చెప్పాలి కదా అని వారు వాపోతున్నారు. కొందరు ప్రేక్షకులు మాత్రం ఏ సినిమా అయితే ఏంటి అని ‘బేబి జాన్’ను చూడడంలో లీనమయిపోయారు. మొత్తానికి నిర్మాతల జోక్యంతో ప్రక్షకులకు తెలియకుండా థియేటర్ యాజమాన్యం ఇలా చేయడం కుదురుతుందనే విషయాన్ని జైపూర్ ప్రజలు తెలుసుకున్నారు.
రెండిటి మధ్య పోటీ
వరుణ్ ధావన్ హీరోగా అట్లీ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రమే ‘బేబి జాన్’ (Baby John). క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యింది. ఒక రీమేక్ మూవీ అయినా కూడా దీనిని ఎలాగైనా హిట్ చేయాలని చాలానే కష్టపడ్డారు మేకర్స్. దేశవ్యాప్తంగా భారీగా ప్రమోషన్స్ కూడా చేశారు. కానీ ఎంతైనా ఒక రీమేక్ అనేది ప్రేక్షకులను అంత సులువుగా మెప్పించలేదు కాబట్టి ‘బేబి జాన్’కు కూడా దాదాపు అదే పరిస్థితి ఎదురవుతోంది. ఇక అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ విషయానికొస్తే.. విడుదలయ్యి మూడు వారాలు అవుతున్నా ఇంకా ఈ మూవీ థియేటర్లలో రికార్డులు బ్రేక్ చేస్తూనే ఉంది. ఈ సినిమా కలెక్షన్స్‌ను ప్రేక్షకులు సైతం ఆసక్తికరంగా ఫాలో అవుతున్నారు. మొత్తానికి ‘పుష్ప 2’ పేరుపై ఎన్ని రికార్డులు ఉంటాయో అని ఎదురుచూస్తున్నారు.