Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు ఒక బ్రాండ్. సినిమాల్లో అయినా.. రాజకీయాల్లో అయినా ఆయనకంటూ ఒక రికార్డ్ ఉంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. సినిమాలు, బ్రాండ్, కోట్లలో వచ్చే పారితోషికం వదిలేసి.. పదేళ్ల క్రితం జనసేన అనే పార్టీని స్థాపించాడు పవన్.
ఎన్నో విమర్శలు, మరెన్నో అవమానాలను ఎదుర్కొంటూ వచ్చాడు. అలా దాదాపు 10 ఏళ్ల తరువాత ఈ ఏడాది పవన్.. ఎన్నికల్లో గెలిచి ఏపీ డిప్యూటీ సీఎం గా పదవిని చేపట్టారు. అది కూడా అలా ఇలా కూడా కాదు.. రికార్డ్ స్థాయిలో గెలిచి చూపించాడు. ఇక ఈ ఎన్నికల తరువాత పవన్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. నేషనల్ వైడ్ గా పవన్ కు మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు.
తాజాగా బాలీవుడ్ పాపులర్ షోలో పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రశ్న అడగడం సంచలనంగా మారింది. కౌన్ బనేగా కరోడ్ పతి షో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో తాజాగా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ప్రశ్నను అమితాబ్ అడగడం సంచలనంగా మారింది.
” 2024 జూన్ లో ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు.. ? ” అని అమితాబ్ అడిగాడు. ఇక ఈ ప్రశ్నకు సదురు కంటెస్టెంట్ ఆడియన్స్ పోల్ అప్షన్ ఎన్నుకున్నారు. ఇక ఆడియన్స్ ఎక్కువమంది పవన్ కళ్యాణ్ అని చెప్పగా.. కంటెస్టెంట్ ఆ ఆన్సర్ ను లాక్ చేశారు. ఈ ప్రశ్న ఖరీదు.. రూ. 1.60 లక్షలు. ఇక ఆడియన్స్ చెప్పిన సమాధానాన్ని కంటెస్టెంట్ ఓకే చేయడంతో పవన్ కళ్యాణ్ అని చెప్పి కంటెస్టెంట్ రూ.1.60 లక్షలు సంపాదించాడు.
ఇక ఈ ప్రశ్నకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోను పవన్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ అదిరా పవన్ కళ్యాణ్ రేంజ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక పవన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG.. ఈ మూడు సినిమాలపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ సినిమాలతో పవన్ ఎలాంటి విజయాలను అందుకుంటాడు అనేది చూడాలి.
అమితాబ్ బచ్చన్ గారి అభిమాని గా మొదలైన @PawanKalyan గారి ప్రస్థానం
ఈరోజు అమితాబ్ బచ్చన్ గారు నిర్వహిస్తున్న అతి పెద్ద షో లో @SrBachchan గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రశ్న అడిగే వరకు వచ్చింది ❤️🙏 pic.twitter.com/XJG60wAxzN
— Pawan Kalyan Crew (@PSPKCrew) September 14, 2024