Monsoon hair care: వర్షాకాలం చల్లదనాన్ని, ఉపశమనాన్ని అందిస్తుంది. కానీ మరోవైపు.. ఇది జుట్టుకు అనేక సమస్యలను కూడా తెస్తుంది. ఈ సీజన్‌లో జుట్టు రాలడం ఒక సాధారణ సమస్యగా మారుతుంది. కానీ ఇది సాధారణంగా తేమ, ఫంగల్ ఇన్ఫెక్షన్, పోషకాహార లోపం వల్ల వస్తుంది. అయితే.. కొన్ని హోం రెమెడీస్ వాడటం వల్ల మీరు ఈ సమస్యలను నివారించవచ్చు. వర్షాకాలంలో జుట్టు రాలడాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 3 ప్రభావవంతమైన హోం రెమెడీస్ ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. కొబ్బరి నూనె, నిమ్మకాయ హెయిర్ మాస్క్:
కొబ్బరి నూనె జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది జుట్టును లోతుగా పోషిస్తుంది. అంతే కాకుండా వాటిని బలంగా చేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది జుట్టును మెరిసేలా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. తద్వారా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.
తయారుచేసే విధానం:
కొబ్బరి నూనె, నిమ్మరసం బాగా కలిపి హెయిర్ మాస్క్ తయారు చేసుకోండి. దీన్ని మీ జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత.. తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి. ఈ హెయిర్ మాస్క్ తరచుగా వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని నిరోదిస్తుంది. అంతే కాకుండా జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది.
2. ఆమ్లా, షికాకై హెయిర్ మాస్క్:
ఉసిరి, శికాకాయ రెండూ జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టును బలపరుస్తుంది. శికాకాయ జుట్టును శుభ్రంగా , మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. ఈ హెయిర్ మాస్క్ జుట్టును సహజంగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా జుట్టుకు అవసరం అయిన పోషణను కూడా అందిస్తుంది.
తయారుచేసే విధానం: ఉసిరి పొడి, శికాకాయ పొడిని నీటిలో కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్ ను మీ జుట్టుకు బాగా అప్లై చేసి 30 నుండి 45 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత షాంపూతో జుట్టును వాష్ చేయండి.
3. పెరుగు, గుడ్డు హెయిర్ మాస్క్:
పెరుగు, గుడ్డు రెండూ జుట్టుకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పెరుగులో ప్రోటీన్ , లాక్టిక్ ఆమ్లం ఉంటాయి. ఇది జుట్టుకు పోషణను అందిస్తుంది. అయితే గుడ్డులో ప్రోటీన్ ఉంటుంది. ఇది జుట్టును బలపరుస్తుంది. ఇది జుట్టు రాలడం, జుట్టు తిరిగి పెరగడం తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని నివారించడంలో ఎగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది జుట్టుకు మృదువుగా కూడా మారుస్తుంది.
Also Read: ఈ టిప్స్ పాటిస్తే.. మొటిమలు మాయం
తయారుచేసే విధానం:
గుడ్డును బాగా గిలకొట్టి.. దానికి ఒక చెంచా పెరుగు కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత రోజు వాడే షాంపూతో తలస్నానం చేయండి. ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఇవి జుట్టు రాలకుండా చేయడంలో సహాయపడతాయి. అంతే కాకుండా జుట్టు పెరగడానికి కూడా ఉపయోగపడతాయి.