ప్రముఖ సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్(Radhika Sarath Kumar) తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ పెట్టడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ నుండి ఫోటోలు షేర్ చేయడంతో కలవరపాటుకు గురి అవుతున్నారు. తమ అభిమాన హీరోయిన్ కి ఏమైంది? అంటూ ఆరా తీస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. గత కొన్ని రోజుల క్రితం రాధికకు గాయమైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ గాయం పై స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు రాధిక. అంతేకాదు ఈరోజు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఎప్పుడు బలంగా ఉండాలని ఒక ఎమోషనల్ నోట్ కూడా షేర్ చేశారు.
రెండు నెలలు నరకంలో నా భర్త అండగా నిలిచారు..
రాధికా శరత్ కుమార్ తన పోస్టులో.. ” గత రెండు నెలలు చాలా కఠినంగా గడిచాయి. సినిమా లొకేషన్లో నా మోకాలికి గాయం అవడంతో సర్జరీ చేయించుకోవాలని చెప్పారు. నొప్పి తగ్గడం కోసం నేను చాలా టాబ్లెట్స్ కూడా ఉపయోగించాను. ఎన్నో థెరపీలు చేయించుకున్నాను. కానీ ఫలితం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. సర్జరీకి ముందు ఆ నొప్పి భరిస్తూనే, నేను అంగీకరించిన సినిమాలు కూడా పూర్తి చేశాను. ముఖ్యంగా పని పై నాకున్న అంకిత భావం చూసి, నా ఫ్రెండ్ కూడా షాక్ కి గురయ్యారు. ఇంత కష్టపడుతున్నావ్ ఆ నిర్మాతలు నీకు కృతజ్ఞతలు చెప్పారా అని కూడా అడిగారు. కానీ నేను అలాంటివి ఆశించలేదు. నా పనిపై మాత్రమే దృష్టి పెడతాను. ఇక సర్జరీ టైం లో నా భర్త నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నన్ను చిన్నపిల్లలాగా చూసుకున్నారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ నేను చెప్పేది ఒక్కటే.. మహిళలు ఎప్పుడూ కూడా ఒకరి పైన ఆధారపడకుండా బలంగా, శక్తివంతంగా ఉండాలి. మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమించుకోవాలి” అంటూ రాధిక తన పోస్టులో రాసుకొచ్చింది. ప్రస్తుతం రాధిక షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
రాధిక కెరియర్..
రాధికా విషయానికి వస్తే.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి, భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సరసన పదుల సంఖ్యలో సినిమాలు చేసిన ఈమె, తన నటనతో అందరిని మెస్మరైజ్ చేసింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈమె.. స్టార్ హీరో శరత్ కుమార్ ను వివాహం చేసుకుంది. ఇకపోతే వరలక్ష్మి శరత్ కుమార్ ఈమెకు స్టెప్ డాటర్ అవుతుందన్న విషయం అందరికీ తెలుసు. ప్రస్తుతం వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar) కూడా శివంగి , కూర్మనాయకి వంటి చిత్రాలలో నటిస్తూనే.. మరొకవైపు బిజినెస్ మాన్ నికోలయ్ సచ్దేవ్ ని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఇకపోతే అతడికి ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. మొత్తానికి అయితే రాధిక ఆ బాధ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ బయటపడే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే మహిళలు దృఢంగా ఉండాలి అంటూ అందరికీ సలహాలు, సూచనలు కూడా ఇస్తోంది.