BigTV English

Netflix : ఉమెన్ మెగా ఫోన్ పడితే కాసుల వర్షం… నెట్ ఫ్లిక్స్ లో ఈ లేడీ డైరెక్టర్స్ చేసిన సినిమాలు చూశారా?

Netflix : ఉమెన్ మెగా ఫోన్ పడితే కాసుల వర్షం… నెట్ ఫ్లిక్స్ లో ఈ లేడీ డైరెక్టర్స్ చేసిన సినిమాలు చూశారా?

Netflix : ఈరోజు అంతర్జాతీయ వుమెన్స్ డే (Women’s Day 2025) సందర్భంగా నెట్ ఫ్లిక్స్ తమ ఓటీటీలో ఉన్న ఇండియన్, ఇంటర్నేషనల్ సినిమాల లిస్ట్ ను తాజాగా పోస్ట్ చేసింది. ఆ లిస్ట్ లో ఉన్న సినిమాలు ఏంటి ? వాటిని ఏ లేడీ డైరెక్టర్స్ తెరకెక్కించారు ? అనే విషయంపై ఓ లుక్కేద్దాం.


డార్లింగ్స్ (Darlings)
ఈ మూవీ 2022లో హిందీలో రిలీజ్ అయ్యింది. జస్మీత్ కె. రీన్ ‘డార్లింగ్స్’ మూవీకి దర్శకత్వం వహించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై అలియా భట్, గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో అలియా భట్ స్వయంగా, షెఫాలి షా , విజయ్ వర్మ, రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రల్లో నటించారు. 2022 ఆగష్టు 5న ‘డార్లింగ్స్’ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్లకు పైగా వ్యూస్ ను కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసింది.

లాపతా లేడీస్ (Laapataa Ladies)
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వంలో రూపొందిన రెండో సినిమా ‘లాపతా లేడీస్’. ఈ కామెడీ సైటెరికల్ ఫీల్‍గుడ్ మూవీ నిర్మాణంలో ఆమిర్ ఖాన్ కూడా పార్ట్ అయ్యారు. మార్చి 1న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 26 నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍ అవుతోంది. ఈ మూవీ ఆస్కార్ నామినేషన్ల దాకా వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. 2025 ఆస్కార్‌ పోటీలకు భారత్​ నుంచి ఎంపికైన ‘లాపతా లేడీస్’ నిరాశ పరిచింది.


లస్ట్ స్టోరీస్ -2 (Lust Stories 2)
2023లో విడుదలైన హిందీ వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 2’. ఆర్‌ఎస్‌విపి మూవీస్, ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై రోనీ స్క్రూవాలా, ఆశీ దువా సారా ఈ సిరీస్ ను నిర్మించారు. ఇందులో ఒక్కో ఎపిసోడ్ కు ఒక్కో డైరెక్టర్ దర్శకత్వం వహించారు. కొంకణా కెన్ శర్మ, సుజోయ్ ఘోష్, ఆర్ బాల్కీ, అమిత్ శర్మ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. నీనా గుప్తా, కాజోల్, తమన్నా భాటియా, మృణాల్, విజయ్ వర్మ, కుముద్ మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్ 29న నుండి నెట్​ఫ్లిక్స్ ఓటీటీ​లో స్ట్రీమింగ్ అవుతోంది.

బార్బీ (Barbie)
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ దక్కించుకున్న మూవీ ‘బార్బీ’. 2023 జూలై 21న రిలీజ్ అయిన ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో హిందీ, ఇంగ్షీషు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే జియోసినిమా ఓటీటీలో ‘బార్బీ’ ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ‘బార్బీ’ చిత్రానికి గ్రెటా గెర్విగ్ దర్శకత్వం వహించగా, ఈ మూవీలో మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్, కేట్ మెక్‍కినోన్, తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇంకా నెట్ ఫ్లిక్స్ తాజాగా రిలీజ్ చేసిన వుమెన్స్ డే స్పెషల్ సినిమాలలో డియర్ జిందగీ (Dear Zindagi), ఖాలా (Qala), స్కేటర్ గర్ల్ (Skater girl), మోక్సీ (Moxie) వంటి సినిమాలు ఉన్నాయి.

 

View this post on Instagram

 

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×