E-Paper
Advertisement

Kanchana 4: భయపెట్టేందుకు మరో సీక్వెల్‌తో లారెన్స్ రెడీ.. ‘కాంచ‌న 4’తో ఈసారి మామూలుగా ఉండదు..

Kanchana 4: భయపెట్టేందుకు మరో సీక్వెల్‌తో లారెన్స్ రెడీ.. ‘కాంచ‌న 4’తో ఈసారి మామూలుగా ఉండదు..
Advertisement

Raghava Lawrence – Kanchana 4: ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్, టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా హారర్ మూవీస్‌తో సినీ ప్రేక్షకుల్ని భయపెట్టేస్తుంటాడు. లారెన్స్ తీసిన సినిమాల్లో ఎక్కువగా హారర్ సినిమాలే. ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి హిట్లను అందుకున్నాడు. అందులో ‘కాంచన’ ఒకటి.

ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ‘ముని’ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో రెండో పార్ట్‌ ‘కాంచన 2’ తెరకెక్కించారు. ఇక రెండో పార్ట్ కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రాబట్టింది. దీంతో మూడో పార్ట్‌ ‘కాంచన 3’తో ప్రేక్షకుల ముందుకు వచ్చి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు ఈ మూవీ పార్ట్ 4కి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ ఫ్రాంచైజీలో మరో సీక్వెల్ ఉన్నట్లు లారెన్స్ గతంలో హింట్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

అయితే ఆ సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుంది అనేది మాత్రం వెల్లడించలేదు. దీనిపై తాజాగా లారెన్స్ అదిరిపోయే అప్డేట్ అందించాడు. ఇందులో భాగంగా ‘కాంచన 4’ ను అనౌన్స్ చేశాడు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు. ఫ్రాంచైజీలుగా తెరకెక్కిన ‘కాంచన’ చిత్రాలకు దర్శకత్వం వహించిన రాఘవ లారెన్సే ఈ సీక్వెల్ చిత్రానికి కూడా స్వీయ దర్శకత్వం వహిస్తున్నాడు.

Also Read: ‘మనమే’ ఫస్ట్ రివ్యూ.. నవ్విస్తూనే కన్నీళ్లు తెప్పించిన శర్వా.. సినిమా ఎలా ఉందంటే..?

Advertisement

ఇక ఈ మూవీని అధికారికంగా ప్రకటించడమే కాకుండా మూవీ షూటింగ్ అప్డేట్‌ను కూడా వెల్లడించారు. ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్టార్ట్ కానున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. ఇక షూటింగ్ కంప్లీట్ అనంతరం ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2024 సమ్మర్‌లో రిలీజ్ చేస్తామని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ కాంచన 4లో నటీ నటులు ఎవరన్నది త్వరలో వెల్లడికావాల్సి ఉంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×