BigTV English

Raghava Lawrence: లారెన్స్ కు షాక్ ఇచ్చిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. ఆ రీమేక్ అన్ని భాషల్లో..

Raghava Lawrence: లారెన్స్ కు షాక్ ఇచ్చిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. ఆ రీమేక్ అన్ని భాషల్లో..

Kill Movie: సాధారణంగా  ఒక భాషలో హిట్ అయిన సినిమాలను మరో భాషలో తెరకెక్కించడమే రీమేక్ చేయడం అంటారన్న విషయం అందరికి తెల్సిందే.  అలా వేరే  భాషలో రిలీజ్ అయిన  సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యి మంచి విజయాలను అందుకున్నాయి.  ఇక కొన్ని సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయినా కూడా రీమేక్ అయ్యాయి. అలాంటివాటిలో  గాడ్ ఫాదర్  కూడా ఉంది. ఇక ఇప్పుడు  అందులో రాఘవ లారెన్స్ కొత్త సినిమా కూడా యాడ్ అవ్వబోతుంది.


రాఘవ లారెన్స్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. స్టూడియోస్ LLP మరియు నీలాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై కోనేరు సత్యనారాయణ  నిర్మిస్తున్నాడు. బిగ్ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. బాలీవుడ్ హిట్ సినిమా కిల్ కు రీమేక్ అని మేకర్స్ అధికారికంగానే తెలిపారు.

లక్ష్య, రాఘవ్ జుయల్, ఆశిష్ విద్యార్థి, హర్ష్ ఛాయా, తాన్య మానిక్తల ప్రధాన పాత్రల్లో నటించిన కిల్ మూవీ జూలై 5 న రిలీజ్ అయ్యి భారీ విజయంను అందుకుంది.  ఇక ఈ మధ్యనే  కిల్.. ఓటీటీలోకి కూడా అడుగుపెటింది. అయితే అది కేవలం హిందీ భాషలో మాత్రమే ఉండడంతో తెలుగువారు దాని జోలికి పోలేదు. దీంతో లారెన్స్  ఈ సినిమాను రీమేక్ చేస్తున్నాడని తెలిసి.. దాని కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. లారెన్స్ కు గట్టి షాక్ ఇచ్చింది.


కిల్ మూవీ డబ్బింగ్ వెర్షన్ నుప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రెండు రోజుల నుంచి కిల్ మూవీ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవ్వడం మొదలయ్యింది. దీంతో హిట్ మూవీ కావడంతో.. అందరూ తమ తమ భాషల్లో చూసేస్తున్నారు. ఇక అన్ని భాషల్లో రిలీజ్ అయ్యకా లారెన్స్ రీమేక్ చేయడం దేనికి అనే ప్రశ్న ఎదురవుతుంది.

కిల్ మూవీ కథను ఏమైనా మారుస్తారా.. ? లారెన్స్ కు తగ్గ కథ అందులో ఏముంటుంది.. ? ఇక ఒకసారి చూసిన సినిమాను మరోసారి చూడడానికి ప్రేక్షకుడు ఇష్టపడతాడా.. ?  ఇలా ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంకొంతమంది అయితే ఎలాగో  అన్ని భాషల్లో వచ్చిందిగా.. ఇంకెందుకు ఈ రీమేక్ అని అంటున్నారు. మరి దీనిపై లారెన్స్ ఎలా స్పందిస్తాడో చూడాలి. 

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×