JVAS Movie : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. ఎన్ని రోజులు గడిచినా కూడా ఆ సినిమాలకు ఉన్న ప్రత్యేకత అలానే ఉంటుంది. గుండమ్మ కథ, మూగమనసులు, మిస్సమ్మ, బడిపంతులు వంటి ఎన్నో సినిమాలు ఆణిముత్యాలు. అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా కే రాఘవేందర్రావు దర్శకత్వం వహించిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాకి ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు మరోసారి విడుదల రానుంది. ఈ సినిమా ప్రింట్ కోసం దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి వెతుకుతున్నట్లు రీసెంట్ గానే చిత్ర యూనిట్ కూడా తెలిపింది.
జగదేకవీరుడు అతిలోకసుందరి కథ
మొదటి ఈ సినిమా థాట్ ను రచయిత శ్రీనివాస్ చక్రవర్తికి రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు. భూమిపైకి వచ్చిన ఇంద్రుడి కూతురు తన ఉంగరాన్ని పోగొట్టుకుంటే ఎలా ఉంటుంది.? అనే కథనం శ్రీనివాస్ చక్రవర్తి తో చెప్పడంతో ఈ కథపై యండమూరి వీరేంద్రనాథ్,జంధ్యాల, సత్యానంద్ వంటి రైటర్లు వరుసగా చర్చించి ఒక అద్భుతమైన కథను డిజైన్ చేశారు. దీనికి ఒక మంచి డ్రామాను యాడ్ చేశారు. అయితే ఈ కథ చర్చల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా దాదాపు 25 రోజులు పాటు ఈ టీం తో గడిపారు. మొత్తానికి కథ పూర్తిగా సిద్దమైన తర్వాత ఇది ఒక సోషియా ఫాంటసీ డ్రామాగా తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు.
Also Read : పాకిస్తాన్‌కు పారిపో.. సాయి పల్లవికి ఉప్పల్ బాలు గ్యాంగ్ వార్నింగ్
అతిలోక సుందరి సెట్ కాదు
మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చాలా సెంటర్లో 100 రోజుల వరకు ఆడింది అయితే ఒక సెంటర్లో 200 రోజులు కూడా ఆడింది ఈ సినిమా. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమాకు సీక్వెల్ చేయాలి అంటే రామ్ చరణ్ హీరోగా, జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించాలి. అని మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు నుంచో చెబుతూనే ఉన్నారు. కానీ రాఘవేంద్రరావు మాత్రం మెగాస్టార్ మాటలకు ఒక కొత్త ట్విస్ట్ ను ఇచ్చారు. శ్రీదేవి ని మ్యాచ్ చేయడం చాలా కష్టం. అతిలోక సుందరగా చూపించాలి అంటే అది మామూలు విషయం కాదు. ఈ పాత్రకు జాన్వీ కపూర్ కూడా సరిపోరు అని దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు. దీంతో ఈ సీక్వెల్ వస్తుంది అనే ఆలోచన కూడా చాలామందిలో ఆగిపోయిందని చెప్పాలి.కానీ నాగ్ అశ్విన్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తే ఈ సినిమాకు సీక్వెల్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది.
Also Read : Trisha Krishnan: హీరోయిన్ కాకపోయింటే ఏమయ్యేదో తెలుసా..అందుకేనా ఇదంతా..?