India Pakistan War| జనరల్ ఆసిమ్ మునీర్.. ఈయన ప్రస్తుతం పాకిస్తాన్ కు ఆర్మీ చీఫ్. దక్షిణాసియా ప్రాంతంలో ఇప్పుడు ఇతని పేరు ప్రాముఖ్యంగా మారింది. మునీర్ ఒక ప్రమాదకర వ్యక్తిత్వం కలవాడు. ఆర్మీ చీఫ్ పదవి చేపట్టే ముందు పాకిస్తాన్ నిఘా వ్యవస్థ ఐఎస్ఐ చీఫ్, మిలటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా మునీర్ ఉన్నత పదవులు చేపట్టాడు. ఇండియాలో 2019 పుల్వామా దాడుల్లో కూడా ఆసిమ్ మునీర్ మాస్టర్ మైండ్. అంతేకాదు ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడి మునీర్ ఆదేశాలతోనే జరిగిందనేది సమాచారం. పుల్వామా బాంబు దాడుల్లో భారత్ కు చెందిన 40 మంది జవాన్లు స్పాట్ లో చనిపోయారు. పహల్గాంలో అయితే 26 మంది అమాయక పర్యటాకులను అకారణంగా కాల్చి చంపారు. ఉగ్రవాద సంస్థలకు అండదండలు అందించే ఆసిమ్ మునీర్ నిజ రూపం వేరే. ఆయన పైకి మిలిటరీ జనరల్ లోపల ద్వేషం మనస్తత్వం కలిగిన ఉగ్రవాది.
ఇప్పుడు పాకిస్తాన్ లో మకుటం లేని మహారాజు ఆసిం మునీర్. పేరుకు ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఉన్నా మునీర్ కనుసన్నల్లోనే అంతా నడుస్తోంది. ప్రభుత్వ పెద్దలందరూ మునీర్ చేతిలో కీలుబొమ్మలే. మునీర్ కు ఇంత అధికారం చేతికి రావడం వెనుక రెండే కారణాలున్నాయి. ఒకటి పగ, రెండోది ఆయన అత్యాశ.
ఇమ్రాన్ ఖాన్ తో శత్రుత్వం
మునీర్‌ని 2018లో అప్పటి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఐఎస్ఐ చీఫ్ గా నియమించారు. కానీ అతని గురించి వాస్తవం తెలుసుకున్న ఇమ్రాన్ ఖాన్ 9 నెలల్లోనే పదవి నుంచి తొలగించారు. ఈ కారణంగానే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై మునీర్ పగపెంచుకున్నాడు. ఐఎస్ఐ చీఫ్ గా తనను తొలగించి ఇమ్రాన్ ఖాన్ తననను అవమానించాడని పగలతో రగిలిపోయాడు ఆసిమ్ మునీర్. అందుకే ప్రతీకారం తీర్చుకోవడానికి అన్ని విధాల ప్రయత్నించాడు. చివరికి ఇమ్రాన్ ఖాన్ భార్యని అవినీతి, ఒక పెద్ద స్కామ్ లో ఇరికించాడు. 2022లో పాకిస్తాన్ ప్రతిపక్షంతో చేతులు కలిసి, కొంతమంది అధికార పార్టీ నాయకులను కూడా కలుపుకొని ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా కుట్ర పన్నాడు. ఫలితంగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూలిపోయింది.
ఇమ్రాన్ ఖాన్ పతనానికి సాయం చేసిన మునీర్ ఖాన్ ని తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన షహబాజ్ షరీప్ అతడనికి ఆర్మీ చీఫ్ పదవి కట్బబెట్టాడు. మిలిటరీ చీఫ్ కాగనే ఒక సంవత్సర కాలంలో తన పగను మునీర్ తీర్చుకున్నాడు. ఇమ్రాన్ ఖాన్ ని జైలుకు పంపాడు. ఆ తరువాత ప్రభుత్వ కీలక విభాగాలు, ఐఎస్ఐ గూడాచార వ్యవస్థ మొత్తం తన ఆధీనంలోకి తీసుకున్నాడు.
Also Read: పాకిస్తాన్‌లో దర్జాగా తిరుగుతున్న 7 మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు.. ఇక వీరికి మూడినట్లే..
మునీర్ కంటే ముందు పాక్ మిలిటరీ జనరల్ గా ఉన్న ఖమర్ జావేద్ బజ్వా పదవి కాలంతో పాకిస్తాన్ లో శాంతి, ఆర్థిక అభివృద్ధి వంటి విధానాలు అమలులో ఉండగా.. మునీర్ పదవి చేపట్టిన తరువాత మతద్వేషం వైపు పాకిస్తాన్ ఉరకలు వేసింది. మద్రసాల చదువుకొని హాఫిజ్ ఖురాన్ పూర్తి చేసిన ఆసిమ్ మునీర్ ఇస్లాం అతివాది. అందుకే అల్లా కోసం జిహాద్ మార్గంలో నడవాలని పాక్ ఆర్మీకి పిలుపునిచ్చాడు. అందుకే ఆయనను అందరూ జిహాదీ జనరల్ లాగా పిలుస్తారు.
వ్యతిరేకిస్తే అణచివేయడమే
తనకు వ్యతిరేకంగా నిలబడే వారిని మునీర్ నిర్దాక్షిణ్యంగా అణచివేస్తాడు. పాక్ ఆర్మీలోనే అతనికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని కఠినంగా శిక్షించాడు. తన పదవికాలం పూర్తి అయినా 2027 వరకు పాక్ మిలిటరీ జనరల్ గా కొనసాగేందుకు పాకిస్తాన్ రాజ్యాంగంలో సవరణలు చేయించాడు. న్యాయవ్యవస్థను కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. బలహీనంగా ఉన్న పాక్ ఆర్థిక వ్యవస్థను తన నియంత్రణలో పెట్టుకున్నాడు. ఏదైనా ప్రాజెక్టు కు నిధులు కావాలంటే ఆర్మీ నాయకత్వంలోని స్పెషల్ ఇన్‌వెస్ట్ మెంట్ కౌన్సిల్ నుంచి ప్రభుత్వం ఆమోదం పొందాల్సిన పరిస్థితి. చైనా, టర్కీ దేశాల సాయంతో పాకిస్తాన్ మిలిటరీలో ఆధునిక ఆయుధాలు సమకూర్చుకున్నాడు. కానీ బలోచ్ రెబెల్స్ దాడులు, పాక్ యువత నుంచి ప్రభుత్వం, ఆర్మీ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత మునీర్ కు పెద్ద సవాళ్లుగా మారాయి.
పొరుగు దేశాలతో కయ్యానికే ప్రాధాన్యం
ఇంట్లో ఇన్ని సమస్యలున్నా బయట మాత్రం మునీర్ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడు. పొరుగు దేశాల్లో ఇప్పటికే ఆఫ్ఘన్ రెఫ్యూజీల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లతో ఉన్న స్నేహ సంబంధాలు తెంచుకున్నాడు. ఇరాన్ పై కూడా కొన్ని నెలల క్రితం దాడులు చేశాడు. ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడి తరువాత ఇండియా సింధూ నది జలాలను తాత్కాలికంగా నిలిపివేయగా.. పాకిస్తాన్ కూడా 1972 సిమ్లా అగ్రిమెంట్ రద్దు చేసింది.దీంతో ఇరు దేశాల మధ్య ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులున్నాయి. ఇండియాలని పంజాబ్, కశ్మీర్ ప్రాంతాల్లో దాడులు చేసేందుకు పాక్ సైన్యం.. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోందని సమాచారం. ఉగ్రవాదుల వద్ద అత్యాధునిక టెక్నాలజీ కలిగిన కమ్యూనికేషన్ పరికరాలున్నాయని వాటిని పాక్ సైన్యమే సమకూర్తుస్తోందని తెలిసింది.
అన్నింటి కంటే ఎక్కువగా మునీర్, అమెరికా ప్రభుత్వంతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అందుకే అతనికి అమెరికా దౌత్యపరంగా సాయం చేస్తోంది. కానీ పహల్గాం దాడి తరువాత పాకిస్తాన్ ప్రపంచదేశాల నుంచి విమ్శలు ఎదుర్కొంటోంది. మునీర్ లాంటి కరుడు గట్టిన ఉగ్రవాది ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ జనరల్ పదవి చేపట్టడంతో ఇండియా అతడిని నిలువరించేందుకు అన్ని సమయాల్లో సిద్ధమై ఉండాలి.