Raghubabu:నటుడు రఘుబాబు(Raghu Babu) అంటే పరిచయాలు అక్కర్లేని పేరు. ఈయన పలు సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. కామెడీ విలన్ గా.. ఎంతో మంచి గుర్తింపు సంపాదించారు. అయితే అలాంటి రఘుబాబు తండ్రి గిరిబాబు(Giri Babu) కూడా ఇండస్ట్రీలో నటుడే. గిరిబాబు చాలా సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి, ఆ తర్వాత హీరో హీ0రోయిన్లకు తండ్రి, మామ,తాత పాత్రల్లో నటించారు. అలా తండ్రి వారసత్వంతో రఘుబాబు ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే అలాంటి రఘుబాబు తాజాగా బ్రహ్మానందం (Brahmanandam) ఆయన కొడుకు గౌతమ్ రాజా (Gautham Raja) తో కలిసి నటిస్తున్న ‘బ్రహ్మ ఆనందం’ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యారు.. రఘు బాబు స్టేజ్ పై మాట్లాడుతూ.. నేను.. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా చేసిన బన్నీ మూవీ (Bunny Movie )లో ఒక కీలక పాత్రలో నటించాను.
చిరంజీవి వల్లే 400 సినిమాలలో నటించాను – రఘు బాబు
అయితే ఈ సినిమా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యాక కూడా సక్సెస్ మీట్ లో నన్ను కనీసం ఎవ్వరూ పట్టించుకోలేదు. స్టేజ్ ఎక్కిన ప్రతి ఒక్కరు సినిమాలో నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని మెచ్చుకున్నారు.కానీ నా పేరు తీసిన నాధుడే లేరు. దాంతో నేను చాలా అసహనానికి గురయ్యాను. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్(VV.Vinayak) సైతం ఏంటయ్యా.. నువ్వు ఈ సినిమాలో అంత బాగా నటిస్తే, కనీసం నీ పేరు కూడా ఎవరూ ఎత్తడం లేదని అడిగాడు. కానీ అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) స్టేజ్ పైకెక్కి స్వయంగా నా పేరు చెబుతూ పొగిడారు. దాంతో నేను చాలా సంతోషించాను.నేను బన్నీ సినిమాను మళ్ళీ మళ్ళీ చూడాలని అనుకుంటే అది కేవలం రఘు బాబు కోసమే అని ఆయన ఆరోజు చెప్పిన మాటలు నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆయన ఆరోజు నన్ను పొగడబట్టే నేను ఇప్పటివరకు 400 కు పైగా సినిమాల్లో నటించాను. ఆయన ప్రశంసే నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చింది. ఎప్పటికీ చిరంజీవి గారి రుణం తీర్చుకోలేను.. అంటూ రఘుబాబు (Raghu Babu) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కొడుకేమో ప్రశంస.. తండ్రేమో విమర్శ..
ప్రస్తుతం రఘుబాబు మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక రఘుబాబు.. చిరంజీవి రుణం తీర్చుకోలేను అని ఆయన్ని పొగిడితే.. రఘుబాబు తండ్రి గిరిబాబు(Giri Babu) మాత్రం కేవలం చిరంజీవి వల్లే నా చిన్న కొడుకు బోసు బాబు జీవితం నాశనం అయింది అని ఆ మధ్యకాలంలో అన్నారు. ఎందుకంటే చిరంజీవి నటించిన సినిమా కారణంగా తన కొడుకు సినిమాని పోస్ట్ పోన్ చేశారని, ఆ తర్వాత చిరంజీవి సినిమా ఫ్లాప్ అవ్వడంతో నా కొడుకు సినిమా హిట్ అయినా కూడా ఫ్లాప్ అని చెప్పారని,ఎందుకంటే ఇండస్ట్రీలో పెద్దవారు చిన్నవారిని తొక్కేయడం చాలా రోజుల నుండి జరుగుతున్న తంతే అంటూ మాట్లాడారు. అలా తండ్రేమో చిరంజీవిని నిందిస్తే.. కొడుకేమో చిరంజీవిని మెచ్చుకున్నారు. ఇక అల్లు అర్జున్(Allu Arjun) నటించిన బన్నీ మూవీలో రఘుబాబు ప్రకాష్ రాజ్ (Prakash Raj) దగ్గర పనిచేస్తారు. అలా కామెడీ విలన్ గా రఘు బాబుని ఈ సినిమాలో చూపించారు.