Shubman Gill: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ముందు టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్ మన్ గిల్ అద్భుత ప్రదర్శన కనబరుచుతున్నాడు. ఈ మెగా టోర్నీ సన్నాహాకాల్లో భాగంగా స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా.. మూడవ వన్డేలో గిల్ {Shubman Gill} అద్భుత సెంచరీ సాధించాడు. తొలి రెండు వన్డేల్లో హఫ్ సెంచరీ తో సత్తా చాటిన గిల్.. అహ్మదాబాద్ వేదికగా నేడు జరుగుతున్న మూడవ వన్డేలో సెంచరీతో మెరిశాడు.
Also Read: Virat Kohli: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ…ఆసియాలో తొలి ప్లేయర్ !
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన భారత జట్టుకు గిల్ {Shubman Gill} అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఆదిలోనే పెవిలియన్ చేరడంతో గిల్.. కోహ్లీతో కలిసి స్కోర్ బోర్డులు పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో గిల్ కేవలం 51 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ ని అందుకున్నాడు. అనంతరం విరాట్ కోహ్లీ 52 పరుగుల వద్ద పెవిలియన్ చేరినప్పటికీ. శ్రేయస్ అయ్యర్ తో కలిసి {Shubman Gill} తన ఇన్నింగ్స్ ని కొనసాగిస్తూ 95 బంతులలో 102 పరుగులు చేసి శతకంతో ఆకట్టుకున్నాడు. కాగా ఇది గిల్ కి 7వ సెంచరీ.
అంతేకాదు ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించడంతో వన్డే క్రికెట్ లో అత్యంత వేగంగా 2,500 పరుగుల మైలురాయిని అందుకున్న భారత క్రికెటర్ గా గిల్ రికార్డు క్రియేట్ చేశాడు. గిల్ {Shubman Gill} కేవలం 50 ఇన్నింగ్స్ లలోనే ఈ రికార్డును అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు శ్రేయస్ అయ్యర్ పేరిట ఉండేది. అతడు {Shubman Gill} 59 ఇన్నింగ్స్ లలో ఈ ఫీట్ ని సాధించాడు. కాగా ఇప్పటివరకు 50 వన్డేలు ఆడిన గిల్ 61. 00 యావరేజ్ తో వన్డేల్లో ఏడు సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. గిల్ అద్భుత ప్రదర్షణపై క్రీడాభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: ICC ODI Batsmen Rankings: ర్యాంకింగ్స్ లో దుమ్ములేపిన గిల్, రోహిత్.. దిగజారిన కోహ్లీ..!
ఇక ప్రస్తుతం భారత్ 33 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 55 బంతులలో 52 పరుగులు చేసి తిరిగి తన ఫామ్ ని నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం గిల్ {111*}, శ్రేయస్ అయ్యర్ {49*} పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ పడగొట్టారు.
టీమిండియాలోనే కాకుండా వన్డే క్రికెట్ హిస్టరీలో ఇన్నింగ్స్ పరంగా అత్యంత వేగంగా 25 వేల పరుగులు సాధించిన ప్లేయర్ల వివరాలు చూస్తే.. టీమ్ ఇండియా ప్లేయర్ గిల్ {50 ఇన్నింగ్స్}, సౌత్ ఆఫ్రికా ప్లేయర్ హషీమ్ ఆమ్లా {51 ఇన్నింగ్స్}, పాకిస్తాన్ ప్లేయర్ ఇమామ్ ఉల్ హక్ {52 ఇన్నింగ్స్}, వెస్టిండీస్ ప్లేయర్ రిచర్డ్స్ {56 ఇన్నింగ్స్}, ఇంగ్లాండ్ ప్లేయర్ జోనాథన్ ట్రాట్ { 56 ఇన్నింగ్స్}.
Shubman Gill continues his fine form with a classy ton in Ahmedabad ✨#INDvENG 📝: https://t.co/XiJhARNt87 pic.twitter.com/04rX4FrtC8
— ICC (@ICC) February 12, 2025