E-Paper
Advertisement

RAID 2 Teaser : అజయ్ దేవగన్ 74వ రైడ్ టార్గెట్ వేల కోట్లు… యాక్షన్ తో దుమ్మురేపుతున్న ‘రైడ్ 2’ టీజర్

RAID 2 Teaser : అజయ్ దేవగన్ 74వ రైడ్ టార్గెట్ వేల కోట్లు… యాక్షన్ తో దుమ్మురేపుతున్న ‘రైడ్ 2’ టీజర్
Advertisement

RAID 2 Teaser : బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ (Ajay Devgn) హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘రైడ్ 2’ (Raid 2). ఈ మోస్ట్ అవైటింగ్ క్రైమ్‌ థ్రిల్లర్‌ కు రాజ్‌ కుమార్‌ గుప్తా ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. 2018లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ‘రైడ్’ సినిమాకు సీక్వెల్‌ గా తెరపైకి రాబోతోంది ‘రైడ్ 2’. తాజాగా ఈ మూవీ టైటిల్ తో పాటు టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

యాక్షన్ తో ‘రైడ్ 2’ టీజర్ అదుర్స్
యాక్షన్ ఎంటర్టైనర్ ‘రైడ్ 2’లో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తుండగా, రితేష్ దేశ్‌ముఖ్ మెయిన్ విలన్ గా, వాణి కపూర్ ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. ఈ మోస్ట్ అవైటింగ్ సీక్వెల్ ను పనోర‌మా స్టూడియోస్ బ్యాన‌ర్‌ పై భూషణ్ కుమార్, అభిషేక్ పాఠక్, క్రిషన్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ లో అజయ్ దేవగన్ రైడ్ చేసి ఏకంగా 4200 కోట్లు సీజ్ చేసినట్టు చూపించారు. 74వ రైడ్ హీరో, విలన్ మధ్య గట్టి యుద్ధానికి దారి తీయబోతోందని హింట్ ఇచ్చారు.

Advertisement

ఇందులో అజయ్ దేవగన్ ఇన్‌క‌మ్ టాక్స్‌లో సీనియర్ అధికారి అయిన అమయ్ పట్నాయక్ అనే పాత్రలో నటించారు. ఆయన బిజినెస్ మ్యాన్ లతో పాటు రాజకీయ నాయకుల ఇళ్లపై వరుసగా రైడ్ చేస్తూ వాళ్ళకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాడని స్పష్టంగా టీజర్ లో చూపించారు. ఈ క్రమంలోనే అమయ్ పట్నాయక్‌కి ఒక రాజ‌కీయ నేత ఇంటిపై ఐటీ రైడ్ చేయాల‌నే ఆదేశం ప్ర‌భుత్వం నుంచి అందుతుంది. అతనొక పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ కావడంతో ఆ ఇలాకాలో కాలు పెట్టడానికే జంకుతారు. అలాంటిది హీరో ఏం చేశాడు ? అనే క్యూరియాసిటీని టీజర్ ద్వారానే క్రియేట్ చేశారు. అంతేకాదు టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విలన్ ఎంట్రీ, హీరో రైడ్ సీన్స్ అదిరిపోయాయి. దాదా బాయ్ గా రితేష్ రోల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాగే ఒత్తిడికి లొంగకపోవడంతో తన కెరీర్‌ లో అమయ్ పట్నాయక్  74 సార్లు బదిలీ కావడం… రితేష్, అజయ్ మధ్య జరిగే ఫైట్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

మూవీ రిలీజ్ పోస్ట్ పోన్
ఇక ‘రైడ్ 2’ టీజర్ లో మూవీ కొత్త రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. స‌మ్మ‌ర్ కానుక‌గా మే 1న ఈ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రాబోతున్న‌ట్లు టీజర్ ద్వారా ప్ర‌క‌టించారు. నిజానికి ‘రైడ్ 2’ను ముందుగా మ‌హా శివ‌రాత్రి కానుక‌గా విడుద‌ల చేద్దామ‌నుకున్నారు మేక‌ర్స్. కానీ పలు అనివార్య కారణాల వల్ల ఫిబ్ర‌వ‌రి 21 నుంచి మూవీ రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేశారు. ఎట్టకేలకు ఈ మూవీని వేసవిలో రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే ప్రమోషన్లు మొదలు పెట్టబోతున్నారు చిత్ర బృందం.

Advertisement

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×