BigTV English

Manchu Manoj : ఎవడున్న లేకున్నా.. మనోజ్‌తో నేను ఉంటా… నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్..!

Manchu Manoj : ఎవడున్న లేకున్నా.. మనోజ్‌తో నేను ఉంటా… నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్..!

Manchu Manoj : విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) దర్శకత్వంలో కే.కే.రాధా మోహన్ నిర్మిస్తున్న యాక్షన్ మూవీస్ ‘భైరవం’. ఈ సినిమా మంచు మనోజ్ (Manchu Manoj), నారా రోహిత్ (Nara Rohit), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) హీరోలుగా నటిస్తున్నారు. వీరి సరసన ఆనంది(Aanandi), అదితి శంకర్(Aditi Shankar), దివ్య పిళ్ళై(Divya pillai) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతేకాదు ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ ఈ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం కాబోతోంది
తమిళంలో సక్సెస్ సాధించిన ‘గరుడన్’ సినిమాకు రీమేక్ గా తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. గుడి, ముగ్గురు మిత్రుల చుట్టూ సాగే యాక్షన్ కథగా ఈ సినిమా రూపొందించినట్లు సమాచారం.


మనోజ్ కి అండగా నేనుంటా – నారా రోహిత్

ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా ఏలూరులో నిన్న రాత్రి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించింది చిత్ర బృందం. ఈ ఈవెంట్ లో మంచు మనోజ్ స్పీచ్ హైలైట్ గా నిలిచింది. ఆయన తన వ్యక్తిగత విషయాలను పంచుకొని ఎమోషనల్ అయ్యారు. దీంతో వెంటనే నారా రోహిత్ స్పందిస్తూ.. ఈ ఈవెంట్ కి సంబంధించి, అలాగే మనోజ్ గురించి ఎక్స్ లో ట్వీట్ వేశాడు. నారా రోహిత్ తన ఎక్స్ ఖాతా ద్వారా… “భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఏలూరు ప్రజలకు చాలా ధన్యవాదాలు. ఈ ఈవెంట్ కి ఇంత క్రేజ్ తీసుకురావడానికి కారణం మా బాబాయ్ మనోజ్. చాలా పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చాడు. ఆయన స్పీచ్ నాకు కూడా చాలా ఇన్స్పైర్ గా అనిపించింది. ఏదేమైనా ఎవరు అండగా ఉన్నా లేకపోయినా బాబాయ్ నేను నీకు అండగా ఉంటాను” అంటూ రోహిత్ రాసుకు వచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


also read:Upcoming Movies in June: తొలకరి జల్లుల వేళ.. ఇండస్ట్రీని హీటెక్కించడానికి సిద్ధమవుతున్న చిత్రాలివే..!

కట్టుబట్టలతో నడిరోడ్డుపై ఉంచారు – మనోజ్ ఆవేదన..

ఇక మంచు మనోజ్ ఆ స్పీచ్ లో ఏం మాట్లాడారు అనే విషయానికి వస్తే.. తన కుటుంబం తనను రోడ్డున పడేసినా.. అభిమానులు అండగా ఉన్నారని, అందరూ కలిసి తనను నడిరోడ్డుపై కట్టుబట్టలతో నిలబెట్టారని, తన పిల్లల బట్టలు కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్ల తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నానని చెప్పిన మంచు మనోజ్.. శివయ్య అంటే శివయ్య రాడని, ఇలాంటి అభిమానులు , డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల రూపంలోనే శివయ్య వస్తాడని మనోజ్ తెలిపారు. ఇక ప్రస్తుతం మనోజ్ చేసిన కామెంట్లు పెద్ద చర్చకు దారి తీయడంతో అటు విష్ణు ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి. మరొకవైపు మంచు విష్ణు (Manchu Vishnu) మాత్రం తాను నటిస్తున్న కన్నప్ప (Kannappa ) సినిమా జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాడ్ కాస్ట్ లో పాల్గొని..” రక్తం పంచుకు పుట్టిన వాళ్లే తన పతనాన్ని కోరుకుంటున్నారు” అంటూ మనోజ్ కి ఇండైరెక్టుగా కౌంటర్ ఇచ్చారు విష్ణు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×