Raj Tarun: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ మధ్యకాలంలో ఎప్పుడూ వివాదాలతోనే వార్తలలో నిలిచారు. రాజ్ తరుణ్ లావణ్య వివాదం అందరికీ తెలిసిందే, గత ఏడాది నుండి ఈ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఆ గొడవలు పక్కన పెట్టి రాజ్ తరుణ్ తన కెరీర్ పై ఫోకస్ పెట్టారు. వరుసగా సినిమాలు షురూ చేశారు. ప్రస్తుతం ఆయన పాంచ్ మినార్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా వుంది.ఇటీవల ఈ సినిమా టీజర్ ను ఏప్రిల్ లో విడుదల చేశారు. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు (మే 11) మరో ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆ వివరాలు చూద్దాం..
కోలీవుడ్ ఎంట్రీ ..
రాజ్ తరుణ్ కామెడీ,లవ్ జోనర్ లో మూవీస్ చేస్తారు. ఆయన సినిమాలన్నీ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. 2013లో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.2017 లో వచ్చిన సినిమా చూపిస్తా మామ తో పాపులర్ అయ్యారు. ఇక అక్కడి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తాజాగా ఆయన టాలీవుడ్ కి కాస్త విరామం ఇచ్చి, కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నట్లుగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో బయిలింగ్వల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రాజ్ తరుణ్ టాలీవుడ్ లో ఎన్నో మూవీస్ తో మెప్పించారు. ఇప్పుడు తమిళ పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ మూవీ తమిళ, తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా ఏకకాలంలో రూపొందిస్తున్నారు. తమిళంలో గోలి సోడా, బైరాగి, వంటి చిత్రాలతో దర్శకుడిగా తన ప్రతిభ నిరూపించుకున్న పాపులర్ సినిమాటోగ్రఫీ దర్శకుడు విజయ్ మిల్టన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన రాజ్ తరుణ్ ను తమిళ్ ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నారు. గోలి సోడా సీక్వెల్లో భాగంగా రాజ్ తరుణ్ ఈ చిత్రానికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆయన ను ఒక డిఫరెంట్ రోల్ లో పవర్ఫుల్ క్యారెక్టర్ తో గ్రాండ్ గా కోలీవుడ్లో ఎంట్రీ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. విషయం తెలుసుకున్న అభిమానులు టాలీవుడ్ కి బాయ్ చెప్పి కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న హీరో అని కామెంట్స్ చేస్తున్నారు..
రాజ్ తరుణ్ గత చిత్రాలు ..
ఇక రాజ్ తరుణ్ గత ఏడాది తిరగబడరా సామి, భలే ఉన్నాడే,పురుషోత్తముడు, చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వీటితోపాటు నా సామిరంగాలో నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకొని అభిమానులను అలరించారు. ఈ చిత్రాలేవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేదు. ఇప్పుడు రాజ్ తరుణ్ ఆశలన్నీ రాబోయే పాంచ్ మీనర్ పైనే ఉన్నాయి. ఈ మూవీ రామ్ కుడుముల దర్శకత్వంలో రానుంది. రాసి సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అజయ్, బ్రహ్మాజీ, తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం శేఖర్ చంద్ర అందించనున్నారు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
#RajTarun కోలీవుడ్ ఎంట్రీ.. @vijaymilton దర్శకత్వంలో బైలింగ్వల్ యాక్షన్ డ్రామా… @itsRajTarun pic.twitter.com/wDC5CGLWCh
— Rajesh Manne (@rajeshmanne1) May 11, 2025