BigTV English

Pumpkin Seeds: గుమ్మడికాయ తింటే.. ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్ !

Pumpkin Seeds: గుమ్మడికాయ తింటే.. ఈ ఆరోగ్య సమస్యలన్నీ పరార్ !

Pumpkin Seeds: గుమ్మడికాయ అనేక పోషకాలు ఉంటాయి. గుమ్మడి కాయ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. వీటిలో ఉండే గుణాలు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. చాలా మంది గుమ్మడి కాయలను వంటకాల్లో కూడా ఉపయోగిస్తారు. ఇంతకీ గుమ్మడి కాయ తినడం వల్ల శరీరానికి ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


గుమ్మడికాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

కంటి చూపును మెరుగుపరుస్తుంది:
గుమ్మడికాయలో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోకి ప్రవేశించినప్పుడు విటమిన్ ఎగా మారుతుంది. అంతే కాకుండా ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. వృద్ధాప్యం వల్ల వచ్చే కంటి సమస్యలను నివారిస్తుంది.


బరువు తగ్గడంలో సహాయపడుతుంది:
గుమ్మడికాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతే కాకుండా వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, ఇది చాలా సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. తద్వారా తరచుగా తినాలనే కోరికను నివారిస్తుంది. ఫలితంగా బరువును అదుపులో ఉంచుతుంది.

రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది:
గుమ్మడికాయలో విటమిన్లు సి , ఇ, ఐరన్ , ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా వ్యాధులతో పోరాడటానికి మీకు బలాన్ని ఇస్తాయి.

గుండె ఆరోగ్యం:
గుమ్మడికాయలో ఉండే పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

చర్మాన్ని మెరిసేలా చేస్తుంది:
గుమ్మడికాయలో ఉండే బీటా-కెరోటిన్, విటమిన్ సి కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడతాయి. ఇవి మీ చర్మాన్ని యవ్వనంగా, మృదువుగా , ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి. ఫలితంగా చర్మ ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది.

జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది:
ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జీర్ణవ్యవస్థను సజావుగా ఉంచుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది మరియు కడుపును తేలికగా ఉంచుతుంది.

మధుమేహాన్ని నియంత్రించండి:
గుమ్మడికాయలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగకుండా నిరోధిస్తుంది. అంతే కాకుండా టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులకు ఇది సురక్షితమైన ఎంపికగా పరిగణించబడుతుంది.

మెదడును చురుకుగా ఉంటుంది:
గుమ్మడి కాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం మెదడు కార్యకలాపాలను మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఇది మానసిక అలసటను తగ్గిస్తాయి.

Also Read: సమ్మర్‌లో ఐస్ క్రీం తెగ తినేస్తున్నారా ? ఎంత ప్రమాదమో తెలుసుకోండి !

అలసట, ఒత్తిడి నుండి ఉపశమనం:
గుమ్మడికాయ గింజల్లో ట్రిప్టోఫాన్ అనే మూలకం ఉంటుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. గుమ్మడి కాయ జ్యూస్ తాగడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి.

క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది:
గుమ్మడికాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. తద్వారా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఆహారంలో భాగంగా గుమ్మడిని చేర్చుకోవడం చాలా మంచిది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×