BigTV English

Raj Tarun: ఇక రాజ్ తరుణ్ కు అది చేయడం కష్టమే..

Raj Tarun: ఇక రాజ్ తరుణ్ కు అది చేయడం కష్టమే..

Raj Tarun lavanya case issue(Tollywood news in telugu): హీరో రాజ్ తరుణ్ వివాదం రోజురోజుకు క్లిష్టంగా మారుతోంది. లావణ్య అనే అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకొని, అబార్షన్స్ చేయించి.. ఇప్పుడు హీరోయిన్ తో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని, ఆమెను వదిలించుకోవడానికి చూస్తున్నట్లు లావణ్య కేసు పెట్టింది. ఇక ఆ కేసులో ఎన్నో నిజాలు బయటపడుతున్నాయి. ఆడియోలు, వీడియోలు, చాట్స్ బయటకొస్తున్నాయి.


ఇంకోపక్క రాజ్ తరుణ్ తన తప్పేమి లేదని, ఇల్లు కోసం ఆమె ఇదంతా చేస్తుందని ఆరోపిస్తున్నాడు. ఇక ఈ గొడవల మధ్య రాజ్ తరుణ్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం మనోడి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి పురుషోత్తముడు.. రెండోది తిరగబడరా సామీ. పురుషోత్తముడు ఈ నెల 26 న రిలీజ్ కానుంది. వచ్చే నెల తిరగబడరా సామీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అతడు ప్రమోషన్స్ కి రావడం కంపల్సరీ.

కానీ, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. రాజ్ తరుణ్ బయటకు వచ్చే ఛాన్స్ లు కనిపించడం లేదు. ఈరోజు పురుషోత్తముడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు రాజ్ తరుణ్ డుమ్మా కొట్టాడు. కొన్ని అనుకోని పరిస్థితుల వలన రాజ్ తరుణ్ ఈవెంట్ కు రాలేకపోయాడని మేకర్స్.


ఇక ఈ సినిమా తరువాత మరో సినిమా ఉంది. ఆ ప్రమోషన్స్ కు కూడా రాజ్ తరుణ్ వచ్చేటట్టు కనిపించడం లేదు. ఈ పరిస్థితిలో మీడియా కంట పడితే.. వారి ప్రశ్నలు ఎలా ఉంటాయి అనేది రాజ్ తరుణ్ కు బాగా తెలుసు. పోలీసుల విచారణకే హాజరుకాలేనని చెప్పిన రాజ్ తరుణ్ .. ఇప్పుడు ప్రమోషన్స్ కు వస్తే ఊరుకుంటారా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఇక హీరో ప్రమోషన్స్ కు రాకపోతే ఎలా అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు.  మరి ఈ రెండు సినిమాలు రాజ్ తరుణ్ కు ఎలాంటి విజయాలను అందిస్తాయో చూడాలి.

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×