BigTV English

Anasuya : అనసూయ ఎమోషనల్.. ప్రెస్ మీట్ లో కన్నీళ్లు .. ఎందుకంటే..?

Anasuya : అనసూయ ఎమోషనల్.. ప్రెస్ మీట్ లో కన్నీళ్లు .. ఎందుకంటే..?

Anasuya : యాంకర్ అనసూయ ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఆ ఉత్సాహమే ఆమెను టాప్ యాంకర్ గా నిలబెట్టింది. అనసూయ సినిమాల్లో మెప్పిస్తోంది. నటిగానూ రాణిస్తోంది. అటు సోషల్ మీడియాలోనూ ఆమె చాలా యాక్టివ్ గా ఉంటోంది. అదే సమయంలో అనేకసార్లు చాలా మంది నెగిటివ్ కామెంట్లు చేస్తూ అనసూయను టార్గెట్ చేశారు. అలాంటి విమర్శలకు భయపడకుండా వారికి గట్టిగా కౌంటర్లు ఇచ్చి తన ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శించింది. ఇలా ఆమె ధైర్యంగా అనేక సవాళ్లను ఎదుర్కొంది. తాను ఎక్కడా తగ్గేదేలేదని నిరూపించింది.


అటు యాంకర్ గా , ఇటు నటిగా డ్యూయల్ రోల్ చేస్తూ అనసూయ కెరీర్ లో దూసుకుపోతోంది. తాజాగా రంగమార్తాండ మూవీలో నటించింది. ఈ సినిమా ప్రెస్ మీట్ లో ఆమె ఎంతో ఎమోషనల్ అయ్యింది. కన్నీరు పెట్టుకుంది. సినిమా ఫైనల్‌ కాపీ చూసి తర్వాత తనకి కన్నీళ్లు వచ్చేశాయని చెబుతూ భావోద్వేగం చెందింది. సినిమా ప్రమోషన్స్‌ విషయంలో కంగారు పడి తరచూ దర్శకుడు కృష్ణవంశీకి కాల్‌ చేసిన విషయాన్ని వెల్లడించింది. సినిమా ప్రమోషన్స్‌ ఇంకా మొదలుపెట్టలేదు ఎలా? అని అడిగితే మన సినిమా మాట్లాడుతుందని కృష్ణవంశీ సమాధానం ఇచ్చేవారని చెప్పుకొచ్చింది.

రంగమార్తాండ మూవీలో నటించడంపై అనసూయ భావోద్వేగం చెందింది. నా జీవితానికి ఇది చాలు అని చెప్పింది. ఈ సినిమా చూసిన తర్వాత అక్కడే ఆగిపోయానని తన అనుభవాన్ని వివరించింది. భావోద్వేగం చెందనని భావించి.. ధైర్యంగా వెళ్లి సినిమా చూస్తున్న సమయంలో కన్నీరు ఆగలేదని తన అనుభవాన్ని వివరించింది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన మూవీ రంగమార్తాండ అని పేర్కొంది.


నాలుగేళ్ల విరామం తర్వాత కృష్ణవంశీ తెరకెక్కించిన సినిమా రంగమార్తాండ. మరాఠీలో మంచి విజయాన్ని అందుకున్న నటసామ్రాట్‌ మూవీకి రీమేక్‌గా రూపొందింది. అంతరించుపోతున్న నాటకరంగం, రంగస్థల నటుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనే అంశం ఈ సినిమా కథాంశం. ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషించారు. శివాత్మిక, రాహుల్‌ సిప్లిగంజ్‌, అలీ రెజా ముఖ్యపాత్రల్లో నటించారు. ఉగాది కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×