BigTV English

SSMB 29: ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ కోసం భారీ పరికరాలు సిద్ధం.. ఏం ప్లాన్ చేశావ్ జక్కన్న.!

SSMB 29: ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ కోసం భారీ పరికరాలు సిద్ధం.. ఏం ప్లాన్ చేశావ్ జక్కన్న.!

SSMB 29: ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఫోకస్ అంతా తెలుగు సినిమాలపైనే ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోలు చేస్తున్న పాన్ ఇండియా సినిమాల గురించే ప్రేక్షకులు తరచుగా మాట్లాడుకుంటున్నారు. అందులో ఒకటి రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం పూర్తయ్యింది, ప్రస్తుతం ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది.. ఇంతే ఇప్పటివరకు ప్రేక్షకులకు అందిన అప్డేట్స్. దీనికి సంబంధించి అప్డేట్స్ ఎక్కువగా రాకపోయినా.. ప్రేక్షకుల ఫోకస్ అంతా ఈ మూవీపైనే ఉంది. తాజాగా రాజమౌళి ఈ సినిమాను ఎలాంటి పరికరాలతో తెరకెక్కిస్తున్నాడో చెప్తూ ఒక వీడియో విడుదలయ్యింది.


భారీ పరికరాలు

మామూలుగా రాజమౌళి సినిమా అంటేనే తను ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తాడని ప్రేక్షకుల్లో ఒక అభిప్రాయం ఉండిపోయింది. తనకు ఏదైనా పర్ఫెక్ట్‌గా ఉండాలని, ఆ పర్ఫెక్షన్ రావడానికి ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉంటాడని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి పాన్ ఇండియా హిట్స్ కొట్టిన తర్వాత రాజమౌళి నుండి మరింత కొత్తదనాన్ని ఆశిస్తారు ప్రేక్షకులు. అందుకే ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యాడు జక్కన్న. దానికోసం భారీ పరికరాలను రంగంలోకి దించాడు. కేవలం కెమెరా వర్క్ కోసమే చాలా సమయం తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు.


అన్నీ సెట్

రాజమౌళి (Rajamouli), మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ అనే విషయం చాలామందికి తెలుసు. దానికోసం ప్రపంచమంతా చుట్టి మంచి మంచి లొకేషన్స్‌ను సెలక్ట్ చేసుకున్నాడు జక్కన్న. ఆ తర్వాత క్యాస్టింగ్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ‘సలార్’తో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయిన పృథ్విరాజ్ సుకుమారన్‌ను తన సినిమా కోసం రంగంలోకి దించాడు. క్యాస్టింగ్ పనులు ఇంకా పూర్తయ్యాయా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు కానీ ఇటీవల మొదటి షెడ్యూల్ మాత్రం పూర్తి చేసుకుంది ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ . అందుకే ఈ మూవీ క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకూడదని సన్నాహాలు మొదలుపెట్టాడు రాజమౌళి.

Also Read: అసలు విలన్ పృథ్విరాజ్ కాదా.. ఇంటర్నేషనల్ డాన్ ఉన్నాడా.? ఇదెక్కడి ట్విస్ట్ మావా.!

క్వాలిటీ మారాలి

ఇప్పటికే తెలుగు సినిమాలు హాలీవుడ్ రేంజ్ క్వాలిటీతో ఉండాలని అక్కడి నుండే పరికరాలు తెప్పిస్తున్నారు మేకర్స్. అలాగే ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ కోసం కూడా భారీ పరికరాలను రంగంలోకి దించాడు జక్కన్న. దానికోసం ఒక స్పెషల్ టీమ్‌ను కూడా తీసుకున్నాడు. ఆ టీమ్ అంతా ఆ పరికరాలు ఎలా ఉపయోగించాలి, దేనికి ఉపయోగపడతాయి అని రాజమౌళికి వివరిస్తున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రాజమౌళి ప్లానింగ్ భారీగానే ఉందని, ‘ఎస్ఎస్ఎమ్‌బీ 29’ విడుదల అవ్వడానికి ఎంత టైమ్ పడుతుందో అని ప్రేక్షకులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మొత్తానికి లేట్ అయినా సినిమా బాగుంటే అదే చాలు అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తే బాగుంటుంది అనుకున్నా కూడా రాజమౌళి సినిమా నుండి అలాంటివి ఆశించవద్దని ఫిక్స్ అయిపోతున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×