BigTV English
Advertisement

SSMB 29: జక్కన్నే కథ లీక్ చేసేస్తాడు…

SSMB 29: జక్కన్నే కథ లీక్ చేసేస్తాడు…

SSMB 29: ఇండియన్ సినిమా చరిత్రలో ఏదైనా కొత్త ట్రెండ్ సెట్ చెయ్యాలంటే, అది రాజమౌళికే సాధ్యం. బాహుబలి, RRR వంటి ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన మాస్టర్ ఫిల్మ్‌మేకర్ రాజమౌళి, ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో SSMB 29 సినిమాతో వరల్డ్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే, రాజమౌళికి ఉన్న ఓ ప్రత్యేకమైన అలవాటు—సినిమా రిలీజ్‌కి ముందే స్టోరీ రివీల్ చేయడం!


ప్రెస్ మీట్‌లో కథ చెప్పేస్తాడు!

రాజమౌళి సినిమాల్లో స్క్రీన్‌ప్లే కీ రోల్ ప్లే చేస్తుంది. కానీ, కథ విషయానికి వచ్చేసరికి, ఆయన మీడియా ముందు ఓ అవుట్‌లైన్ చెప్పేయడం కామన్. ఈగ, బాహుబలి, RRR సినిమాల్లోనూ ఇదే ఫార్మాట్ ఫాలో అయ్యాడు. ఇది రాజమౌళి సిగ్నేచర్ మూవ్ అనే చెప్పాలి. ఇప్పటికే రాజమౌళి-మహేష్ బాబు ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబుతో రాజమౌళి ఒక గ్లోబ్-ట్రాట్టింగ్ అడ్వెంచర్ ఫిల్మ్ చేస్తున్నారని, ఇది ఇండియానా జోన్స్ స్టైల్‌లో ఉంటుందని టాక్…. అయితే ఈ ప్రాజెక్ట్ ఉన్న అన్ని డౌట్స్ కి రాజమౌళి స్వయంగా సమాధానం ఇవ్వబోతున్నాడు.


ఏప్రిల్ 2nd వీక్‌లో బిగ్ ప్రెస్ మీట్!

లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం, ఏప్రిల్ రెండో వారంలో రాజమౌళి, మహేష్ బాబు, ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ కలిసి ఓ భారీ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌లో SSMB 29 కథను రివీల్ చేయనున్నాడు జక్కన్న! ఈ ప్రెస్ మీట్‌తో స్టోరీ, కాస్ట్ అండ్ క్రూ విషయంలో క్లారిటీ రానుంది . RRR ప్రెస్ మీట్‌లో రాజమౌళి కథను ఎలా వివరించాడో, ఇప్పుడు అదే స్టైల్ లో SSMB 29 కథనూ జక్కన్న చెప్పనున్నాడు.

ఎంతో పెద్ద స్పాన్ ఉన్న కథ?

ఈసారి రాజమౌళి ఏ స్థాయి స్కేల్‌లో ఈ సినిమా చేస్తున్నాడు? RRRతో ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి, SSMB 29తో గ్లోబల్ స్టాండర్డ్స్ అందుకోబోతున్నాడా? సినిమా కాన్వాస్ ఎంత గొప్పగా ఉంటుందనే చర్చ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ట్రెడ్ సర్కిల్స్, ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా కేవలం ఇండియా లెవల్ స్టోరీ కాకుండా అంతర్జాతీయ స్థాయిలో యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందున్నట్లు తెలుస్తోంది. యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్, టెక్నికల్ టీమ్—all top-class professionals తో రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నాడు. ఇక SSMB 29 కోసం మహేష్ బాబు తన ఫిజికల్ అపీరెన్స్‌లో భారీ మార్పులు చేసుకుంటున్నట్లు సమాచారం. యాక్షన్ సీక్వెన్సుల కోసం ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు.

ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో!

రాజమౌళి – మహేష్ బాబు కాంబో అనగానే అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ ప్రెస్ మీట్‌లోనే సినిమా ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ పోస్టర్ వంటివి కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా, మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో చూడాలి!

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×