Intinti Ramayanam Today Episode April 2 nd : నిన్నటి ఎపిసోడ్ లో.. హాస్పిటల్లో అవని ప్రాణాలతో పోరాడుతూ ఉంటుంది.. కానీ ఇంట్లో రాజేంద్రప్రసాద్ బాధపడుతూ ఉంటాడు నా కూతుర్ని చంపాలనుకొని అవినీతి కాల్చానని అంటాడు. పల్లవి మాత్రం మీరేం తప్పుగా ఫీల్ అవ్వకండి మావయ్య తప్పు చేసేలా చేసిన వారిని కాల్చారు. మంచిపనే చేశారని పల్లవి అంటుంది. ఈ అనార్దాలు అన్నిటికి కారణం అవని కదా.. మంచి పని చేశారు అని పల్లవి అంటుంది. దానికి రాజేంద్రప్రసాద్ అది కరెక్ట్ కాదు నేను చేసింది తప్పే అని దానికి క్లారిటీ ఇస్తాడు.అక్షయ్ అవని కోసం బాధపడుతూ ఉంటాడు. రాజేంద్రప్రసాద్ అక్షయ దగ్గరకొచ్చి నా గారాల కూతురు అలా చేసిందంటే సహించలేకపోయానని అంటాడు.
ఇక అక్షయ్ఇంటి దగ్గర టెన్షన్ పడుతూ ఉంటాడు. అవనీకి ఏమైందని కమల్ ని శ్రీధర్ ని అడుగుతాడు ఎలా ఉంటే నీకేం అవసరం లేదు కదా అన్నయ్య అనేసి కమలంటాడు. నీకు అవసరం లేదని వెళ్ళిపోయావు కదా నీకు ఎంతసేపు మీ అమ్మ నాన్న నీ తమ్ముడు చెల్లెలు అంతే తాళి కట్టిన భార్య అవసరం లేదు.అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు పిల్లల్ని కనడం ఎందుకు అని కమల్ఆవేశంతో మాట్లాడుతాడు. ఉదయం రాజేంద్ర ప్రసాద్ పై పోలీసులు అరెస్ట్ చెయ్యాలని వస్తారు. ఆ తర్వాత అవన్నీ వచ్చి పోలీసులు దగ్గర నిజం చెప్పేసి రాజేంద్రప్రసాద్ ని వదిలేయమని చెప్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రాజేంద్రప్రసాద్ ని అరెస్ట్ చేయాలి అటెంప్ట్ మర్డర్ కేసు కింద అనేసి పోలీసులు చెప్తారు. ఇక అవన్నీ ఇలాంటి పనిచేస్తదని అసలు ఊహించలేదు అంటూ పల్లవి అవనిపై చాడీలు చెప్పే ప్రయత్నం చేస్తుంది. కేసు పెట్టింది అవని వదిన కాదు నేను అనేసి కమలంటాడు. మీ నాన్న మీద నువ్వు కేసు పెట్టడమేంటి అనేసి కమల్ ని అందరూ తిడతారు. వేరే వాళ్ళు చేస్తే తప్పు నాన్న చేస్తే తప్పు కాదా అనేసి కమల్ అందరితో గట్టిగానే వాదిస్తాడు. పోలీసులు మాత్రం రాజేంద్రప్రసాద్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది మీరు రండి అనేసి అంటారు.
రాజేంద్ర ప్రసాద్ ను పోలీసులు తీసుకెళ్తుంటే బయట అవని వస్తుంది. ఎవరు చంపాలని ప్రయత్నించలేదు పొరపాటున తగిలింది. నేను కేసు పెట్టలేదు కదా హత్య ప్రయత్నం చేస్తే నేను కేసు పెట్టాలి. అవని అరెస్ట్ చేస్తారా నిజా నిజాలు తెలుసుకొని అరెస్ట్ చేయడం మేలు అనేసి ఎస్ఐతో అంటారు.. ఇక పోలీసులు రాజేంద్రప్రసాద్ వదిలేసి వెళ్లిపోతారు.
అవని ఇంటికి వెళ్ళగానే భరత్ నువ్వేం చేస్తున్నావ్ నీకైనా అర్థమవుతుంది అక్క నీ వాళ్లకు మంచి చేయాలని చెప్పి నువ్వు కష్టాలను కొని తెచ్చుకుంటున్నావు కొంచమైనా ఆలోచించాలి కదా అని భరత్ అంటాడు. అయితే ప్రణతి ప్రెగ్నెన్సీకి భరత్ కారణం కాదు అని స్వరాజ్యం దయాకర్కు తెలిసిపోతుంది. వాళ్లొచ్చి నీ మంచితనం మరీ ఇంత ఎక్కువైతే మంచిది కాదమ్మా నీ తమ్ముడిని బలి చేస్తున్నావ్ అనేసి అంటారు. నేను ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక చేశాను బాబాయ్ ఎలాగైనా సరే ప్రణతి ప్రేమించిన అబ్బాయిని తీసుకువచ్చి పెళ్లి చేస్తాను అని అంటుంది.
ఇక కమల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇంట్లో వాళ్ళందరూ దారుణంగా మాట్లాడతారు. నా భార్య నేను కొడితేనే అంతగా ఫీలయ్యారు. మరి కడుపుతో ఉన్న నా చెల్లెల్ని నాన్న చంపాలని చూసాడు. మరి నేనెంత ఫీల్ అవ్వాలి అని కమలంటాడు. కానీ భానుమతి మాత్రం నా కొడుకు మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా నేను పుట్టినప్పటినుంచి వాడిని కొట్టలేదు తిట్టలేదు అలాంటిది నా కొడుకుని పోలీసులకు పట్టించాలని చూస్తావా ఇంట్లోంచి బయటికి వెళ్ళు అని బయటకు గెంటేస్తుంది.
కానీ రాజేంద్ర ప్రసాద్ మాత్రం వదిలేయమ్మ వాని అనేసి అంటాడు. ఇక రాజేంద్రప్రసాద్ తో పార్వతి మాట్లాడటం పల్లవి వింటుంది. అవని మంచిదే ఇవన్నీ చేయకుండా మన పరువు తీయకుండా కాపాడుకుంటూ వచ్చింది అని రాజేంద్రప్రసాద్ అంటాడు. దానికి పార్వతి అవని చేసేవాన్ని మనల్ని నమ్మించే చేసింది మీరు కొంచెం ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నాను ఈ విషయాలు గురించి మర్చిపోండిఅని అంటుంది. అది విన్న పల్లవి అవని గురించి మళ్ళీ నెగిటివ్గా ఏదో ఒకటి చేయాలి లేకుంటే అవన్నీ మళ్ళీ ఇంటికి వస్తుందని ప్లాన్ చేస్తుంది.
ఇక కమల్ భానుమతి పల్లవిలకు మధ్య ఫిట్టింగ్ పెడతాడు. పల్లవిని భానుమతి నా మొగుడు ఫోటో ఎందుకు తీసావ్ అంటూ చితక్కొట్టేస్తుంది. పెద్ద దానివని ఊరుకుంటున్నా అని పల్లవి అంటుంది. నన్ను కొట్టేంత పెద్ద దానివి నువ్వు అనేసి ఇద్దరు ఒకరినొకరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. కమల్ మాత్రం వీళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటాడు. నేను వేసిన ప్లాను ఇంత బాగా వర్క్ అవుతది అని అస్సలు అనుకోలేదు అని అంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ప్రణతిని కలవడానికి అక్షయ వస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..