Rajendra Prasad : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో రాజేంద్రప్రసాద్ ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన రాజేంద్రప్రసాద్, అతి తక్కువ కాలంలోనే మంచి పేరును సంపాదించుకొని హీరోగా కూడా నిలదొక్కుకున్నారు. అందరు హీరోలలో కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన పంథా ఏర్పాటు చేసుకున్నాడు. మిగతా హీరోలు సినిమాలు కంటే రాజేంద్రప్రసాద్ సినిమాలు కొంతమేరకు ప్రత్యేకంగా ఉంటాయి అని చెప్పాలి. ఎన్నో కామెడీ ఫిలిమ్స్ కి హీరోగా నటించారు. రాజేంద్రప్రసాద్ కామెడీ టైమింగ్ ఇప్పటికే చాలామందిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. కేవలం కామెడీకి మాత్రమే పరిమితం కాకుండా ఎమోషనల్ సీన్స్ లో కూడా తన సత్తా ఏంటో చూపించారు రాజేంద్రప్రసాద్. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ ఏపీ ప్రభుత్వము పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
అసలేం జరిగింది.?
ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గురించి పక్కన పెడితే, గత ప్రభుత్వం వలన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చాలా సమస్యలు ఎదుర్కొంది. ముఖ్యంగా టికెట్ రేట్ విషయంలో ఆ ప్రభుత్వానికి ఎదురైన సమస్యలు మాటల్లో చెప్పలేనివి. అతి తక్కువ ధరకే పెద్ద సినిమా టికెట్లు అమ్మడం అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నష్టం తీసుకొచ్చింది. దీనిని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ నాని వంటి హీరోల సినిమాలను కూడా టార్గెట్ చేశారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి చాలామంది సినిమా ప్రముఖులను అప్పటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరకు తీసుకువెళ్లి సినిమాకు సంబంధించిన సమస్యలు అన్నిటిని చర్చించారు. ఆ తర్వాత టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వడంతో ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన త్రిబుల్ ఆర్ వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద విడుదలై మంచి కలెక్షన్స్ రాబట్టాయి.
సీఎంను ఎందుకు కలవాలి.?
ఇక ప్రస్తుతం గత కొన్ని రోజులుగా థియేటర్స్ బందుకు పిలుపును ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో ఇలా థియేటర్స్ బంద్ చేయడం అనేది కేవలం పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడం అని చాలామంది భావించారు. ఈ విషయం బహుశా పవన్ కళ్యాణ్ దృష్టి వరకు చేరినట్లుంది. అందుకే ఏకంగా పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది. ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు సీఎం గారిని కలవలేదు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ తరుణంలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటే కళాకారులు, ఈ కళాకారులు సీఎం గారిని ఎందుకు కలవాలి అని రాజేంద్రప్రసాద్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వాస్తవానికి ఆ వీడియో ఇప్పటిది కాదు 2019 కి సంబంధించిన వీడియో, కొంతమంది కావాలని ఆ వీడియోను ఇప్పుడు షేర్ చేసి పవన్ కళ్యాణ్ ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటి వరుకు CM ని కలవలేదు అన్న పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ కి అసలు ఎందుకు కలవాలి అని కౌంటర్ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్. pic.twitter.com/ALefTKzyHC
— Monster🇮🇳 (@varmamaster7) May 25, 2025