BigTV English

Cleanest Airports: ప్రపంచంలో క్లీనెస్ట్ ఎయిర్ పోర్టులు ఇవే, చిన్న చిత్తు కాగితం కూడా కనిపించదు!

Cleanest Airports: ప్రపంచంలో క్లీనెస్ట్ ఎయిర్ పోర్టులు ఇవే, చిన్న చిత్తు కాగితం కూడా కనిపించదు!

Cleanest Airports in the World: ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన విమానాశ్రయాలకు సంబంధించి స్కైట్రాక్స్ 2025 ర్యాంకింగ్స్ ప్రకటించింది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తూర్పు ఆసియాలోని విమానాశ్రయాలే ఆగ్రస్థానంలో నిలిచాయి. అద్భుతమైన టెర్మినల్స్, నేచురల్ బాత్రూమ్‌లు, పరిశుభ్రమైన ప్రాంగణాలతో ఈ జాబితాలో టాప్ పొజిషన్ లో నిలిచాయి.


ప్రపంచంలోనే అత్యంత శుభ్రమైన విమానాశ్రయాలు

⦿ టోక్యో హనేడా విమానాశ్రయం


టోక్యో హనేడా విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన విమానాశ్రయాల్లో టాప్ ప్లేస్ ను దక్కించుకుంది. ఇక్కడి నుంచి ప్రతి ఏటా ఏటా 85 మిలియన్లకు పైగా ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. విమానాశ్రయంలో 24 గంటలూ పని చేసే శానిటేషన్ సిబ్బందిని నియమించింది. అర్ధరాత్రి తర్వాత టెర్మినల్స్‌ లో UV శానిటైజింగ్ రోబోట్‌లతో సహా అధునాతన శుభ్రపరిచే సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. ఇక్కడి బాత్రూమ్ లు కూడా ఆటోమేటిక్ గా పని చేస్తాయి. విమానాశ్రయంలోకి వచ్చే గాలిని కూడా ఫిల్టర్ చేసే వ్యవస్థను కలిగి ఉంది.

⦿ సింగపూర్ చాంగి విమానాశ్రయం

పరిశుభ్రమైన విమానాశ్రయాలలో ఇది రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇండోర్ జలపాతాలు, అటవీ లోయలతో కూడిన నిర్మాణ అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఇక పరిశుభ్రత విషయంలో ఈ విమానాశ్రయం ఎక్కడా రాజీ పడదు. ఈ ఎయిర్ పోర్టులో ఏకంగా 500 మంది శానిటేషన్ సిబ్బంది 24 గంటలపాటు విధులు నిర్వర్తిస్తారు. ఆటోమేటెడ్ క్లీనింగ్ పరికరాలను ఉపయోగిస్తూ శుభ్రంగా ఉంచుతారు.

⦿ దోహా హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం

ఖతార్ లోని ఈ విమానాశ్రయం మెరిసే పాలరాయితో నిర్మించారు. ఎడారి వాతావరణంలో పనిచేస్తున్నప్పటికీ, హమద్ ఇంటర్నేషనల్  అల్ట్రా మోడ్రన్ టెర్మినల్స్ అంతటా అత్యంత శుభ్రత ప్రమాణాలను పాటిస్తోంది. ఇక్కడి సిబ్బంది కూడా 24 గంటల పాటు అత్యధునిక క్లీనింగ్ యంత్రాలతో విమానాశ్రయాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు.

⦿ సియోల్ ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం

ఇది ప్రపంచంలో నాలుగో స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా శుభ్రతకు నిదర్శనంగా నిలుస్తుంది. అత్యాధునిక సాంకేతికతను మ్యాన్ పవర్ తో కలిపి విమానాశ్రయాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఏటా 70 మిలియన్లకు పైగా ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తున్నప్పటికీ, నిరంతరం పరిశుభ్రంగా ఉంటుంది.  UV-C క్రిమిసంహారక రోబోట్లను ఉపయోగిస్తున్నారు. ఇవి ఎయిర్ పోర్టులోని అన్ని ప్రాంతాలను ప్రతి 30 నిమిషాలకు ఓసారి శానిటైజేషన్‌ చేస్తాయి.

⦿ హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం

హాంకాంగ్ విమానాశ్రయం టాప్ 5లో నిలిచింది. ఈ ఎయిర్ పోర్టులో శుభ్రపరచాల్సిన ప్రాంతాలను ఆటోమేటిక్ యంత్రాలు గుర్తించి శానిటైజ్ చేస్తాయి. రియల్ టైమ్ క్లీనింగ్ టీమ్స్ ను పంపుతుంది. ఇక్కడి బాత్రూమ్ సౌకర్యాలు ఆటోమేటెడ్ ఆక్యుపెన్సీ ట్రాకింగ్‌ను కలిగి ఉంటాయి.

⦿ సెంట్రైర్ నగోయా విమానాశ్రయం

సెంట్రల్ జపాన్ కేంద్రంగా సేవలందిస్తున్న ఈ విమానాశ్రయం అత్యంత శుభ్రమైన ఎయిర్ పోర్టుల లిస్టులో మరోసారి చేరింది. చూడ్డానికి అందంగా ఉండటంతో పాటు పరిశుభ్రంగా ఉంచేందుకు  ఇక్కడి సిబ్బంది నిరంతరం ప్రయత్నిస్తున్నారు.

⦿ టోక్యో నరిటా అంతర్జాతీయ విమానాశ్రయం

టోక్యోలోని రెండవ ప్రధాన విమానాశ్రయం అయిన నరిటా అత్యంత పరిశుభ్రంగా ఉంటుంది. హనేడా కంటే పాతది అయినప్పటికీ,  పరిశుభ్రతకు మారుపేరుగా నిలుస్తోంది. విమానాశ్రయంలో AI సహాయంతో శానిటైజేషన్ నిర్వహిస్తున్నారు.

⦿ కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం

ఒసాకా బేలోని కృత్రిమ ద్వీపంలో నిర్మించబడిన కాన్సాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం.. సముద్ర వాతావరణం నుంచి సవాళ్లను ఎదుర్కొంటుంది. అయినప్పటికీ చక్కటి శుభ్రత ప్రమాణాలను పాటిస్తోంది. విమానాశ్రయం టెర్మినల్ భవనం అంతటా అత్యంత పరిశుభ్రంగా ఉంటుంది. విమానాశ్రయం టెర్మినల్ సహజ కాంతిని విస్తృతంగా ఉపయోగించుకుంది. ఇది శక్తిని ఆదా చేయడమే కాకుండా UV ఎక్స్‌పోజర్ ద్వారా పరిశుభ్రమైన పరిస్థితులను మెయింటెయిన్ చేస్తుంది.

Read Also: రైల్వే స్టేషన్లలో మెట్రో తరహా ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు.. ఇక అలా వెళ్లడం కష్టమే!

Related News

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Big Stories

×