Rajendra Prasad: సీనియర్ నటుడు, నటి కిరీటి రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) తాజాగా థియేటర్ల బంద్ (Theater shutdown)అంశంపై మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇండస్ట్రీలో జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్లు బంద్ అవుతాయనే వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని ఎక్కడ అధికారికంగా ప్రకటించకపోయిన ఈ వార్త మాత్రం ఇండస్ట్రీలో అల్లకల్లోలం సృష్టించింది. ఏకంగా ఈ వార్తలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) స్పందిస్తూ సినీ ఇండస్ట్రీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 12వ తేదీ ఆయన నటించిన సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో థియేటర్లు బంద్ అని ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమ తీరుపై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ థియేటర్ల బంద్ అంశంపై సంచలన ప్రకటన విడుదల చేసిన అనంతరం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక్కొక్కరు ఈ అంశంపై మాట్లాడుతూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఉద్దేశపూర్వకంగానే చేశారు…
తాజాగా నట కిరీటి రాజేంద్రప్రసాద్ సైతం థియేటర్ల బంద్ అనే అంశం గురించి ఆయన నటించిన “షష్టిపూర్తి” సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేటర్లు బంద్ చేయడం అనేది ఆషామాషీ విషయం కాదు. థియేటర్లు మూసి వేయడం అనేది ఒకరు చెబితే చేసేది కాదు ఈ నిర్ణయాన్ని అందరూ కలిసికట్టుగా తీసుకోవాల్సి ఉంటుంది. కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ విధమైనటువంటి తప్పుడు వార్తలను సృష్టించి ఈ వార్తను మిస్ గైడ్ చేశారని, చివరికి వారి కల నిజం కాలేదని తెలిపారు. ఇలా తప్పుడు వార్తలను ఎవరు సృష్టిస్తున్నారనేది కనపడితే ఇకపై ఇలాంటి వార్తలకు మనం పూర్తిగా పులి స్టాప్ పెట్టినట్లేనని రాజేంద్రప్రసాద్ తెలిపారు.
సగం హైదరాబాద్, మద్రాస్ నాదే..
థియేటర్లను బంద్ చేస్తామనే మాట చిన్న విషయం కాదు.. ఇలాంటివి ఇకపై ఎప్పుడు జరగకూడదని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయంపై మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ ఈ కుట్ర వెనుక ఎవరున్నారో కనుక్కోవాలి అంటూ ఆదేశాలు జారీ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అదేవిధంగా తన సినిమాల గురించి మాట్లాడుతూ నేను డబ్బు కోసం సినిమాలలో నటించడం లేదు అలా డబ్బు కోసమే సినిమాలు చేసి సినిమాల ద్వారా సంపాదించింది పెట్టుబడులుగా పెట్టి ఉంటే ఈపాటికి సగం హైదరాబాద్ మద్రాస్ నాదే అయ్యి ఉండేదని ఈయన తెలిపారు. నేను కేవలం మంచి సినిమాలలో నటించడం కోసమే ప్రయత్నిస్తానని, ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాకు తమ్ముడితో సమానం కానీ ఇప్పటివరకు ఆయన సినిమాలలో నటించే అవకాశం మాత్రం రాలేదు. త్వరలోనే ఆ కోరిక కూడా నెరవేరాలని కోరుకుంటున్నాను అంటూ రాజేంద్రప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.