BigTV English

Vettaiyan: సూర్యతో పోటీకి సిద్ధమైన రజినీకాంత్.. ‘వెట్టియాన్’ రిలీజ్ డేట్ ఖరారు

Vettaiyan: సూర్యతో పోటీకి సిద్ధమైన రజినీకాంత్.. ‘వెట్టియాన్’ రిలీజ్ డేట్ ఖరారు

Vettaiyan  Vs Kanguva: సూపర్ స్టార్ రజినీకాంత్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. కుర్ర హీరోలతో సమానంగా వరుస సినిమాలు చేస్తున్నాడు. గతేడాది ‘జైలర్’ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా రజినీ కెరీర్‌ను మలుపుతిప్పింది. అప్పటి వరకు తీసిన ప్రతి సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. కానీ జైలర్ మూవీ మాత్రం అతడికి మంచి కంబ్యాక్ ఇచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అబ్బురపరచింది.


ముఖ్యంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా ఒక కారణమని చెప్పాలి. అతడు అందించే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినీ ప్రియుల్ని ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నాయి. ‘వా నువు కావాలయ్యా’ సాంగ్ అయితే ఇక చెప్పాల్సిన పనేలేదు. యావత్ సినీ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. అలాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రజినీ మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడు.

అందులో తన కెరీర్‌లో 170వ సినిమా ఇప్పుడు చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘వెట్టియాన్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రముఖ దర్శకుడు ‘జై భీమ్’ ఫేం టీ.జే జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తెలుగులో ‘వేటగాడు’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతుంది. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నాడు.


Also Read: తలైవా కొత్త సినిమా డిజిటల్ రైట్స్.. ఆ ఓటీటీకే సొంతం..?

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. స్టార్ కాస్టింగ్ ఇందులో నటిస్తుండటంతో అభిమానుల్లో మరింత క్యూరియాసిటీ క్రియేట్ అయింది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయన్ వంటి స్టార్ నటీ నటులు ఇందులో భాగం అయ్యారు. దీనిబట్టి చూస్తుంటే ఈ సినిమాని దర్శకుడు ఏ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి.

ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్‌ల కోసం తలైవా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించిన ఓ సర్‌ప్రైజ్‌ను మేకర్స్ అందించారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్నట్లు అధికారికంగా తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా వదిలారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే మరికొందరు మాత్రం కాస్త కంగారు పడుతున్నారు. ఎందుకంటే అదే రోజు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘కంగువ’ కూడా రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఏర్పడిందనే చెప్పాలి. ఈ రెండు సినిమాల్లో ఏది వెనక్కి తగ్గుతుందా లేక రెండూ ఒకేరోజు రిలీజ్ అవుతాయా అని చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×