BigTV English

Agricultural department statement: రుణమాఫీ.. ఆరోపణలు ఖండన, కంగారు పడొద్దంటూ రైతులకు సూచన

Agricultural department statement: రుణమాఫీ.. ఆరోపణలు ఖండన, కంగారు పడొద్దంటూ రైతులకు సూచన

Agricultural department statement(Latest news in telangana): రైతుల రుణమాఫీపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ఖండించింది వ్యవశాయ శాఖ. అబద్ద ప్రచారాన్ని ఏమాత్రం నమ్మవద్దని స్టేట్‌మెంట్ ఇచ్చింది. రుణమాఫీ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని, అర్హులైన రైతులకు వస్తుందని భరోసా ఇచ్చింది ఆ శాఖ.


రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని, ప్రభుత్వం ప్రకటించిన విధి విధానాల ప్రకారం చివరి విడతలో రూ. 2 లక్షల రుణాలున్న రైతులకు రుణమాఫీ వర్తిస్తుందని పేర్కొంది. ఇప్పటివరకు రూ. 2 లక్షల లోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని, బ్యాంకు ఖాతాలు, ఆధార్ నెంబర్లు, పాసు బుక్ ఉన్న ప్రతి రైతు కుటుంబానికి మాఫీ జరిగిందని తెలియజేసింది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని ప్రస్తావించింది.

బ్యాంకులో చిన్న కారణాలతోనూ దాదాపు 22 వేల ఖాతాల్లో వేసిన డబ్బులు వెనక్కి వచ్చాయని పేర్కొంది. వీటిలో చిన్న చిన్న తప్పులను గుర్తించిన వ్యవసాయ శాఖ, ఎప్పటికప్పుడు సరి చేస్తుందని వెల్లడించింది. ఇప్పటికే 8 వేల ఖాతాలకు తిరిగి డబ్బులు జమ చేసిందని గుర్తు చేసింది.


ALSO READ:  బిగుస్తున్న ఉచ్చు.. కేసీఆర్, హరీష్, ఈటలకు నోటీసులు

బ్యాంకు ఖాతాలు సరిగా లేనివారు, కుటుంబ నిర్ధారణ జరగని ఖాతాలు, ఆధార్ నెంబర్లలో తప్పులు న్నవి, పాస్ బుక్ నెంబర్లు లేనివి, బ్యాంకు ఖాతాల్లో ఉన్న పేర్లతో ఆధార్ ఉన్న పేర్లతో సరిపోని ఖాతాలు ప్రస్తుతానికి పెండింగ్‌‌లో ఉన్నాయి. వీటన్నింటినీ సరి చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. స్థానిక మండల వ్యవసాయ అధికారిని కలిసి, వీటిని సరి చేసుకుంటే వీరి ఖాతాల్లో రైతు రుణమాఫీ నిధులను ప్రభుత్వం జమ చేస్తుందని వెల్లడించింది.

ఆధార్ సరిగ్గా లేకుంటే వెంటనే ఆ రైతు తన సరైన ఆధారాలు ఓటర్ ఐడీ లేదా, వెహికల్ లైసెన్స్ లేదా రేషన్ కార్డును ఎంఈవోకు అందించాలి. వాటిని పోర్టల్లో అప్‌లోడ్ చేసి సరిచేసుకోవటం ద్వారా రుణమాఫీ పొందేందుకు అర్హులవుతారు. నెల రోజుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ వ్యవసాయ శాఖ పరిష్కరిస్తుందని తెలిపింది.

మరోవైపు విపక్షాల ఆరోపణలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గతంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి నానా కష్టాలు పడి, సగం కూడా చేయలేద న్నారు. చివరకు రైతుల నమ్మకం కోల్పోయారన్నారు. గత ప్రభుత్వం 2014 నుంచి 2018 వరకు మొదటి విడత లక్ష లోపు రుణమాఫీ కోసం నాలుగు దఫాల్లో 16, 143 కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు.

2019 నుంచి రెండో దఫాకేవలం 11,561 కోట్ల రూపాయలు కేటాయించారని వివరించారు. గత ప్రభుత్వం దిగిపోయేనాటికి ఇంకా 8,579 కోట్ల రూపాయలను చెల్లించలేదని పేర్కొన్నారు. మా ప్రభుత్వం రెండు లక్షల లోపు 17,933 కోట్ల రూపాయలను రుణమాఫీ చేసిందని, ఈ స్థాయిలో ఎవరూ చేయలేదని గుర్తు చేశారు.

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×