BigTV English

Rajinikanth : సర్జరీ తరువాత స్టెప్పులు… అదిరిపోయే స్టెప్పులేసిన తలైవా వీడియో వైరల్

Rajinikanth : సర్జరీ తరువాత స్టెప్పులు… అదిరిపోయే స్టెప్పులేసిన తలైవా వీడియో వైరల్

Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వేట్టయన్’. తమిళ దర్శకుడు టీజె జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అక్టోబర్ 10న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. దసరా కానుకగా థియేటర్లలోకి ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలోనే తలైవా (Rajinikanth)  అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా రజనీకాంత్ అదిరిపోయే స్టెప్పులు వేసిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.


స్టెప్పులతో అదరగొట్టిన తలైవా

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో కొత్తదేం కాదు. రజనీకాంత్ హీరోగా నటించిన మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్లో జరిగింది ఈ ఘటన. చెన్నై వేదికగా ఈ ఈవెంట్ సెప్టెంబర్ లో అదిరిపోయే రేంజ్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో ఓ పాటకు రజినీకాంత్ స్టెప్పులు వేస్తూ అభిమానుల్లో జోష్ పెంచారు. కాగా తాజాగా రజనీకాంత్ ఆడియో లాంచ్ లో స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే ఈ వీడియోను షేర్ చేస్తూ ఇచ్చిన అప్డేట్ మాత్రం కొత్తదే. ‘వేట్టయన్’ ఆడియో లాంచ్ ఫుల్ ఈవెంట్ ఇప్పుడు సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది అంటూ రజినీ స్టెప్పులేసిన వీడియోను షేర్ చేశారు. ఇక రజనీకాంత్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఈ వీడియో బయటకు రావడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రజనీకాంత్ సర్జరీ వల్ల సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్నప్పటికీ ఈ వీడియోను వైరల్ చేస్తూ ఆయన అభిమానులు సినిమాను ప్రమోట్ చేసుకోవడం విశేషం.


సర్జరీ తరువాత కోలుకుంటున్న తలైవా

గత సోమవారం అర్ధరాత్రి రజినీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ ఆధ్వర్యంలో వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేసి గుండెలో స్టంట్ వేశారు. ఇక రజిని ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఆయనను గురువారం రాత్రి 11 గంటలకు డిశ్చార్జ్ చేశారు. సూపర్ స్టార్ త్వరగా కోలుకోవాలని అప్పటిదాకా ప్రార్థనలు చేసిన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా పూర్తిగా కోలుకున్న తర్వాత రజినీకాంత్ తన నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ చేయనున్నారు.

రజినీ కొత్త సినిమాల సంగతేంటి?

తలైవా రజినీకాంత్ ఇప్పుడు పూర్తిగా రెస్ట్ తీసుకోబోతున్నారు కాబట్టి ‘వేట్టయన్’ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక కొలుకున్నాక ఆయన కొత్త సినిమా ‘కూలీ’ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ లో మూడు వారాల తర్వాత రజనీకాంత్ భాగం కానున్నారు. అంతలోపు సినిమాలోని మిగతా సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరించబోతున్నారు. ఈలోపు ఆయన హీరోగా నటించిన మరో చిత్రం ‘వేట్టయన్’ థియేటర్లలో అభిమానులను అలరించనుంది. మరి దసరా కానుకగా రానున్న ఈ ‘వేట్టయన్’ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×