E-Paper
Advertisement

Vettaiyan Collections : బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న వేట్టయాన్ కలెక్షన్స్… ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

Vettaiyan Collections : బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న వేట్టయాన్ కలెక్షన్స్… ఎన్ని కోట్లు రాబట్టిందంటే?
Advertisement

Vettaiyan Collections: సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ జైలర్ తర్వాత న‌టించిన చిత్రం ‘వేట్టయన్- ద హంట‌ర్‌’. తమిళ స్టార్ డైరెక్టర్ జై భీమ్ ఫేమ్ టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించింది. సుభాస్క‌ర‌న్ నిర్మాతగా వ్యవహరించారు.. ఈ మూవీ ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న విడుదలై బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఏసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్‌ తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. సీడెడ్ ఏరియాలో శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేసింది. గ్లోబల్ గా అన్ని ఏరియాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతూ రిలీజైన కొద్ది రోజుల్లోనే 240 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. ఇది ఇండియన్ సినిమా చరిత్రలో ఓ మైల్ స్టోన్ అని చెప్పుకోవడమే గాక, లైకా ప్రొడ‌క్ష‌న్స్ కి మంచి బూస్టింగ్ అని చెప్పొచ్చు. ఐదు రోజులు అయినా కూడా కలెక్షన్స్ లో ఎటువంటి మార్పులు రాలేదు. బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తుంది.

టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సెస్ ప్రేక్షక లోకాన్ని కట్టిపడేశాయి. ప్రతి షాట్ లో డైరెక్టర్ టేకింగ్ హైలైట్ అయింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫాహిద్ ఫాజల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, దుశారా విజయన్ నటన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా తన ఎనర్జిటిక్ పర్ఫార్‌మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అనిరుధ్ అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో కీలకం అయింది.. ఈ సినిమాలోని పాటలు కూడా హైలెట్ గా నిలిచాయి.

Advertisement

లైకా ప్రొడక్షన్స్‌కు చెందిన GKM తమిళకుమారన్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై M షెన్‌బాగమూర్తి ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. వేట్టైయన్‌ సినిమాలో గ్రిప్పింగ్ కథాంశం, వినూత్నమైన దర్శకత్వం చూశామని, సినిమా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు అదేవిధంగా విమర్శకులు కామెంట్స్ చేస్తుండటం పట్ల చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. న్యాయం, అధికారం, ఎన్‌కౌంటర్ హత్య, అవినీతి విద్యా వ్యవస్థ ఇతివృత్తాలను ఈ సినిమాలో ఎంతో పవర్ ఫుల్ గా చూపించారు. కొన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోకపోయిన మరికొంతమందిని బాగా కనెక్ట్ అయ్యేలా చేసింది. ఈ వెట్టయన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ. 240 కోట్లను అధిగమించడం, ఇటీవలి కాలంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా అవతరించడం విశేషం. అన్ని వయసుల వారు ఈ సినిమాను ఆదర్శిస్తుండటం గమనార్హం. ఇక ఈ మూవీకి ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి షో నుంచి మిక్సీ్డ్ టాక్ ను అందుకున్న ఈ వేట్టయాన్ మూవీ కలెక్షన్స్ మాత్రం తగ్గకుండా దూసుకుపోతుండటం విశేషం.. రజినీ సినిమాకి ఆ మాత్రం రాబడుతాయి. ఇక రజినికాంత్ ఆరోగ్యం సరిగ్గా లేదన్న విషయం తెలిసిందే.. దాని వల్లే ఈ సినిమా ప్రమోషన్స్ కు దూరంగా ఉన్నారు. అందుకే సినిమా జనాలకు పెద్దగా రీచ్ అవ్వలేదు. ఆరోగ్యం కుదుట పడేవరకు కొత్త సినిమాను చెయ్యడని తెలుస్తుంది. మరోవైపు ఇక సినిమాలకు దూరం కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి..

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×