E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu: సొంత మనుషులే ప్రేరణకు వెన్నుపోటు, మణికంఠకు అన్యాయం.. అందరూ కలిసి తేజను గట్టెంక్కిచారుగా!

Bigg Boss 8 Telugu: సొంత మనుషులే ప్రేరణకు వెన్నుపోటు, మణికంఠకు అన్యాయం.. అందరూ కలిసి తేజను గట్టెంక్కిచారుగా!
Advertisement

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అయినప్పటి నుండి నామినేషన్స్ డేను కూడా బోర్‌గా ఫీల్ అవుతున్నారు ప్రేక్షకులు. మామూలుగా బిగ్ బాస్ రియాలిటీ షో అంటేనే గొడవలు. అందుకే సండే కాకుండా మండేను ఫండే అంటుంటారు ఆడియన్స్. ఎందుకంటే ఆరోజే నామినేషన్స్ జరుగుతాయి కాబట్టి. కానీ బిగ్ బాస్ 8లో ఇప్పటివరకు ఆడియన్స్ ఎంజాయ్ చేసే రేంజ్‌లో నామినేషన్స్ జరగలేదు. మొదటిసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత నామినేషన్స్ అనేవి కాస్త ఇంట్రెస్టింగ్‌గా జరిగాయి. అందుకే ఈ నామినేషన్స్ ఎపిసోడ్ అనేది ఒక్కరోజులో ప్రసారం చేయడం కష్టమని రెండు భాగాలుగా విభజించారు బిగ్ బాస్ మేకర్స్.

కావాలని బాధపెట్టారు

Advertisement

ఈసారి నామినేషన్స్ కాస్త డిఫరెంట్‌గా జరిగాయి. హరితేజ, ప్రేరణలో ఎవరైతే ముందు గార్డెన్ ఏరియాలో ఉన్న హ్యాట్ పట్టుకుంటారో వారి చేతికే ఒక కంటెస్టెంట్‌ను నామినేట్ చేసే అధికారం వెళ్తుంది. వారి ముందు ఇద్దరు కంటెస్టెంట్స్ వచ్చి తాము నామినేట్ చేయాలనుకుంటున్న వ్యక్తి పేరు, కారణాలు చెప్పగా.. ఆ ఇద్దరి నుండి ఎవరిని నామినేట్ చేయాలో ప్రేరణ, హరితేజ డిసైడ్ చేస్తారు. అలా ముందుగా రోహిణి వచ్చి గౌతమ్‌కు నామినేట్ చేసింది. కామెడీ టాస్క్‌ను కామెడీగా తీసుకోకుండా సీరియస్‌గా తీసుకున్నాడని కారణం చెప్పింది. దానికి గౌతమ్ రివర్స్ అయ్యాడు. అవినాష్ చేసింది కామెడీ కాదని కావాలని ఒకరిని బాధపెట్టడం అని వాగ్వాదానికి దిగాడు. అంతే కాకుండా బిగ్ బాస్ అనేది కామెడీ షో కాదని కామెడియన్స్‌ను తక్కువ చేసినట్టుగా మాట్లాడాడు.

Also Read: బిగ్ బాస్ హౌస్ లో మరో రచ్చ.. అతడు నామినేట్ చేస్తే ఎలిమినేట్?

Advertisement

తేజ సేఫ్

కామెడీ షో కాదంటూ గౌతమ్ చేసిన కామెంట్స్‌ వల్ల రోహిణి, అవినాష్‌కు కోపమొచ్చింది. గౌతమ్‌పై సీరియస్ అయ్యారు. అవినాష్ అయితే ఎమోషన్‌లో గౌతమ్ కాళ్ల మీద పడి సారీ అన్నాడు. రోహిణి నామినేషన్ ముగిసిన తర్వాత నిఖిల్ వచ్చి పర్ఫార్మెన్స్ బాలేదని కారణం చెప్పి తేజను నామినేట్ చేయాలనుకుంటున్నానని చెప్పాడు. కానీ ప్రేరణ చేతిలో అధికారం ఉండడంతో తను తేజను కాపాడి గౌతమ్‌ను నామినేట్ చేసింది. తనను టార్గెట్ చేస్తున్నట్టుగా భావించిన గౌతమ్ మళ్లీ ఏడ్చాడు. ఆ తర్వాత మరోసారి నిఖిల్‌కే అవకాశం దక్కగా తను తేజను నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పాడు. గంగవ్వ వచ్చి బీబీ హోటల్‌లో పర్ఫార్మెన్స్ బాలేదని చెప్పి పృథ్విని నామినేట్ చేసింది. దీంతో ప్రేరణ.. మరోసారి తేజను కాపాడి పృథ్విని నామినేట్ చేసింది.

సపోర్ట్ లేదు

తనను నామినేట్ చేసిందని ప్రేరణపై పగ పెంచేసుకున్నాడు పృథ్వి. తనకు నయని పావని కూడా యాడ్ అయ్యింది. ఎలాగైనా ఇద్దరూ కలిసి ప్రేరణను నామినేట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఆఖరికి యష్మీ, నిఖిల్ కూడా ప్రేరణకు సపోర్ట్‌గా నిలబడలేకపోయారు. అదే విషయంపై నయనికి, ప్రేరణకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. యష్మీ వచ్చి తేజ పేరు, మణికంఠ వచ్చి నిఖిల్ పేరు చెప్పినప్పుడు కూడా తేజ మరోసారి సేవ్ అయ్యాడు. చివరిగా అవినాష్ వచ్చి మణికంఠ పర్ఫార్మెన్స్ బాలేదని, గౌతమ్ వచ్చి విష్ణుప్రియా పర్ఫార్మెన్స్ బాలేదని చెప్పగా.. హరితేజ.. మణికంఠనే నామినేట్ చేసింది. బీబీ హోటల్ టాస్క్‌లో మణి బాగా ఆడాడని తెలిసినా తనే నామినేట్ అవ్వడంతో ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యారు.

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×