Siddhu Jonnalagadda: ఈరోజుల్లో చాలావరకు యంగ్ హీరోలు మాస్ ఇమేజ్ కోసం ట్రై చేయడం కంటే యూత్‌ను ఇంప్రెస్ చేయడంపైనే ఎక్కువగా దృష్టిపెడుతున్నట్టు అనిపిస్తోంది. అలా యూత్‌ను ఎక్కువగా ఆకట్టుకున్న హీరోలు మాత్రమే త్వరగా తమ మార్కెట్‌ను పెంచుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాంటి యంగ్ హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) కూడా ఒకడు. ‘డీజే టిల్లు’ అనే మూవీ సిద్ధు కెరీర్‌ను పూర్తిగా మలుపు తిప్పింది. ఇప్పటికీ సిద్ధు సినిమా అనగానే అందరికీ ముందుగా అదే గుర్తొస్తుంది. అలా తన సినిమాలతో, పాత్రలతో యూత్‌కు విపరీతంగా దగ్గరయిన సిద్ధు.. మొదటిసారి ఫ్యామిలీ హీరోగా ప్రయోగం చేయనున్నాడని సమాచారం.
ఫ్యామిలీ డైరెక్టర్‌తో సినిమా
సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుండి సిద్ధు జొన్నలగడ్డ ఎక్కువగా యూత్‌ఫుల్ సినిమాల్లోనే కనిపించాడు. ప్రేమకథలు, యూత్‌కు కనెక్ట్ అయ్యే స్టోరీలతోనే అందరినీ అలరించాడు. అలాంటి సిద్ధు మొదటిసారి తన రూటు మార్చనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయడంపై తన ఫోకస్ మారనుందట. ఒక ఫ్యామిలీ డైరెక్టర్‌తో సినిమా చేయడానికి సిద్ధు జొన్నలగడ్డ ఒప్పుకున్నాడని టాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ దర్శకుడు మరెవరో కాదు.. ‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ (Parasuram). విజయ్ దేవరకొండను ఫ్యామిలీస్‌కు దగ్గర చేసిన పరశురామ్ ఫోకస్ ఇప్పుడు సిద్ధుపై పడిందట.
అప్పుడు విజయ్.. ఇప్పుడు సిద్ధు..
అప్పటినుండి యూత్ హీరోగా ఫేమస్ అయిన విజయ్ దేవరకొండను ఒక్కసారిగా ‘గీతా గోవిందం’తో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యేలా చేశాడు పరశురామ్. అందుకే పరశురామ్‌కు మరొక అవకాశం ఇచ్చాడు విజయ్. కానీ వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన రెండో సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ మాత్రం డిశాస్టర్ అయ్యింది. అంతే కాకుండా పరశురామ్ టేకింగ్‌పై కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. ‘ఫ్యామిలీ స్టార్’ను దిల్ రాజు నిర్మించారు. ఆ మూవీ ఫ్లాప్ అయినా కూడా పరశురామ్‌కు మరొక అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట ఈ ప్రొడ్యూసర్. అందుకే వీరి కాంబినేషన్‌లో తెరకెక్కే మూవీలో హీరోగా సిద్ధు జొన్నలగడ్డను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం.
Also Read: సోషల్ మీడియాలో ఫేక్ ఫోటో వైరల్, స్పందించిన మాళవికా.. మరీ ఇంత దారుణమా.?
ఫ్యామిలీ ఆడియన్స్ కోసం
అప్పటివరకు యూత్ హీరోగా ఉన్న విజయ్ దేవరకొండను ఫ్యామిలీ జోన్‌లోకి తీసుకొచ్చాడు పరశురామ్. అలాగే సిద్ధును కూడా తీసుకొస్తాడని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అసలు వీరి కాంబినేషన్‌లో సినిమా ఫైనల్ అయ్యిందా, ఏ జోనర్‌లో తెరకెక్కనుంది లాంటి విషయాలు బయటికి రాకపోయినా.. పరశురామ్ లాంటి ఫ్యామిలీ డైరెక్టర్‌తో సిద్ధు సినిమా అంటేనే వినడానికి కొత్తగా ఉందని ఆడియన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం సిద్ధు.. యూత్ హీరోగా సెటిల్ అయిపోయినా కూడా ఎక్కువకాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్నా.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర అవ్వాల్సిందే. దానికోసం సిద్ధుకు ఇదే మంచి అవకాశం అని ఇండస్ట్రీ నిపుణులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సిద్ధు ఒకేసారి మూడు సినిమాలను పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నాడు.