Yuzvindra Chahal: టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన సతీమణి ధనశ్రీ వర్మ నుండి విడాకులు తీసుకోబోతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముంబైకి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్, దంత వైద్యురాలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మను ప్రేమించి 2020 డిసెంబర్ 22న ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్ లోని ఓ రిసార్ట్ లో వివాహం చేసుకున్నాడు చాహల్. ఈ జంట వివాహం ఇరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది.
Also Read: ICC ODI Team of Year: టీమిండియాకు అవమానం.. ICC ODI జట్టులో ఒక్కడూ లేడు ?
కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉన్న చాహల్ సోషల్ మీడియాలో ధనశ్రీ డాన్స్ వీడియోలను చూశాడు. దీంతో తనకు డ్యాన్స్ నేర్చుకోవాలని ఉందని ఆమెని సంప్రదించాడు. ధనశ్రీ కూడా చాహల్ కి డాన్స్ నేర్పేందుకు అంగీకరించి ఆన్ లైన్ లోనే డాన్స్ నేర్పించేది. ఇలా వీరిద్దరి మధ్య ఏర్పడ్డ స్నేహం ప్రేమగా మారింది. ధనశ్రీని క్లీన్ బోల్డ్ చేసి లవ్ లో పడేశాడు చాహల్. ముందు చాహలే తనకి లవ్ ప్రపోజ్ చేశాడని ధనశ్రీ వర్మ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
అనంతరం అతడి గురించి తెలుసుకున్న ధనశ్రీ తన తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొంతకాలం సవ్యంగానే సాగిన వీరి దంపత్య జీవితంలో అభిప్రాయ భేదాలు తలెత్తాయి. మొదట ధనశ్రీ వర్మ ఇంస్టాగ్రామ్ లో తన పేరు నుంచి “చాహల్” అనే పేరును తీసివేయడంతో వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయని రూమర్స్ వినిపించాయి.
ఆ తర్వాత చాహల్ “న్యూ లైఫ్ లోడెడ్” అంటూ ఇంస్టాగ్రామ్ లో స్టోరీ రాయడం, సోషల్ మీడియా ఖాతాలలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, చాహల్ తన భార్య ధనశ్రీ వర్మ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ నుండి డిలీట్ చేయడం.. ఈ కారణాల వల్ల వీరిద్దరూ విడిపోతారనే ఊహాగానాలు బలపడ్డాయి. గత కొద్ది రోజుల నుండి అయితే వీరిద్దరూ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది.
కానీ ఈ జంట మాత్రం ఇప్పటివరకు వీటిని ఖండించలేదు. అయితే తాజాగా ఈ జంట విడిపోతుందంటూ జాతీయ మీడియా కథనాలు కూడా పేర్కొంటున్నాయి. అంతేకాదు చాహల్ తన భార్య నుంచి విడిపోతే.. భరణంగా ఆమె రూ.100 కోట్లు డిమాండ్ చేస్తుందని కథనాలు పేర్కొంటున్నాయి. ధనశ్రీ వర్మతో చాహాల్ విడాకులు తీసుకుంటే.. ఫ్యామిలీ కోర్టు సమంత – నాగచైతన్య విడాకుల విషయంలో చెల్లించిన భరణాన్ని ఉదాహరణగా తీసుకోవచ్చని పేర్కొంటున్నారు.
Also Read: Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇకపై ఉచితంగా స్టేడియంలోకి ఎంట్రీ ?
భరణం నిర్ణయించే సమయంలో చాహల్ ఆస్తి, అలాగే అతని సంపాదనను కోర్టు పరిగణలోకి తీసుకుంటుందని చెబుతున్నారు. మొత్తానికి చాహల్ కి విడాకులు ఇచ్చేందుకు ధనశ్రీ వర్మ 100 కోట్లు డిమాండ్ చేసిందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ధనశ్రీ వర్మ ముంబైలో తన తల్లితో కలిసి ఉంటుంది.