BigTV English

Rakhi Sawant: ఇక నేను తల్లిని కాలేను.. హీరోయిన్‌ రాఖీసావంత్ ఎమోషనల్‌

Rakhi Sawant: ఇక నేను తల్లిని కాలేను.. హీరోయిన్‌ రాఖీసావంత్ ఎమోషనల్‌

Rakhi Sawant latest news(Bollywood celebrity news): బాలీవుడ్ సినీ పరిశ్రమలో స్పెషల్ సాంగ్స్‌లో అదరగొట్టిన హీరోయిన్ రాఖీ సావంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందంతోపాటు అభినయంతో స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్‌గా నిలిచింది. దీంతో బాలీవడ్ పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలోనూ విపరీతమైన పాలోయింగ్ సంపాదించుకుంది. అయితే ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో కొంతకాలం సైలెంట్ అయిపోయింది. మళ్లీ హిందీ బిగ్ బాస్ రియాల్టీ షోతో ఫామ్‌లోకి వచ్చింది.


బిగ్ బాస్ హౌస్‌లో హీరోయిన్ రాఖీ చేసిన సందడి, కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మళ్లీ సందడి చేస్తున్న ఈ బ్యూటీ..గతంలో ఎందుకు సైలెంట్ అయ్యానో చెప్పుకొచ్చింది. ‘కొద్ది రోజుల క్రితం అనారోగ్యంగా ఉండటంతో వైద్యులను సంప్రదించాను. ఓ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయగా..గుండెపోటు లక్షణాలు ఉన్నాయని, నా గర్భాశయంలో 10 సెంటీమీటర్ల కణితి ఉన్నట్లు చెప్పారు. సర్జరీ చేయించుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం ఉందని చెప్పడంతో వెంటనే సర్జరీ చేయించుకున్నా.’ అని చెప్పారు.

Also Read: జాబిలమ్మ నీకు అంత కోపమా సాంగ్ హీరో వడ్డే నవీన్ గుర్తున్నాడా.. ఇప్పుడేం చేస్తున్నాడంటే..?


ఈ సర్జరీలో భాగంగా కణితితోపాటు గర్భాశయాన్ని కూడా వైద్యులు తొలగించారు. ఇక నేను తల్లిని కాలేనని వైద్యులు చెప్పడంతో ఏడ్చేశానన్నారు. అయితే నేను తల్లి అవ్వాలంటే.. సరోగసీ ద్వారా పిల్లలను పొందాలని హీరోయిన్ రాఖీ సావంత్ ఎమోషనల్ అయింది. ఇక ఆస్పత్రిలో ఉన్న సమయంలో హీరో సల్మాన్ ఖాన్ అండగా నిలిచాడని, తన మెడికల్ బిల్లులు మొత్తం ఆయనే భరించారని చెప్పింది.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×