BigTV English

Anna canteens reopen: ఏపీలో అన్నా క్యాంటీన్లు మళ్లీ ఓపెన్, ఈసారి..!

Anna canteens reopen: ఏపీలో అన్నా క్యాంటీన్లు మళ్లీ ఓపెన్, ఈసారి..!

Anna canteens reopen: ఆంధప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఆగష్టు 15న వీటిని అందుబాటులోకి తీసుకు రావాలని ఆలోచన చేస్తోంది. తొలి దశలో 183 క్యాంటీన్లు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


అన్న క్యాంటీన్లు గురించి చెప్పనక్కర్లేదు. పల్లెటూరు నుంచి పట్టణం, నగరాలకు వచ్చే ప్రజలకు తక్కువ డబ్బులతో కడుపు నింపే పథకం. గతంలో చంద్రబాబు సర్కార్ దీన్ని తీసుకొచ్చింది. బాగానే సక్సెస్ అయ్యింది. కంటిన్యూ అవుతుందని భావించారు. ఈలోగా ప్రభుత్వం మారిపోవడంతో జగన్ సర్కార్ వీటిని పక్కనపెట్టేసింది.

అన్నక్యాంటీన్లు పునఃప్రారంభించాలని ఆలోచన చేస్తోంది ఏపీలోని కూటమి సర్కార్. ఈ విషయాన్ని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. తొలి దశలో 183 క్యాంటీన్లు ప్రారంభించాలని భావిస్తోంది. గతంలో నిర్వహించిన క్యాంటీన్ భవనాలను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేసే బాధ్యతను పట్టణ, స్థానిక సంస్థలకు ప్రభుత్వం అప్పగించింది.


టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. 183 క్యాంటీన్ల మరమత్తుల కోసం దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు ఓ అంచనా. ఈ నెలాఖరులోగా ఆహారం సరఫరా చేసే టెండర్లను ఖరారు చేయనున్నారు. అన్నక్యాంటీన్ల పేరుతో ఓ ట్రస్ట్ ప్రారంభించనున్నట్లు సమాచారం. దీని కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్ రెడీ చేస్తున్నారు.

ALSO READ: ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రాజీనామా !

క్యాంటీన్ల నిర్వహణ కోసం దాతల నుంచి విరాళాలు సేకరించాలని భావిస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే కుప్పం టూర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎప్పటిమాదిరిగా పనుల కోసం పట్టణం, నగరాలకు వచ్చే ప్రజలకు తక్కువ ఖర్చుతో ఆహారం లభించనుందన్నమాట.

Tags

Related News

Pawan Kalyan: రాయలసీమ అభివృద్ధిపై.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: సీఎం చంద్రబాబు సూపర్ న్యూస్.. వారికి దసరా రోజున అకౌంట్లలోకి రూ.15వేలు

Jagan: మళ్లీ దొరికిపోయిన జగన్.. అప్పుడలా, ఇప్పుడిలా అంటూ నిజాలు బయటపెట్టిన టీడీపీ

AP Dasara Holidays 2025: విద్యార్ధులకు అలర్ట్.. దసరా సెలవుల్లో మార్పులు

Minister Lokesh: రియల్ టైమ్ గవర్నెన్స్‌లో మంత్రి లోకేష్.. నేపాల్‌లో తెలుగువారితో వీడియో కాల్

AP Govt Plan: ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఇకపై నో ఆఫీసు, నేరుగా ఇంటికే

Big Stories

×