
Sapta Sagaralu Dhati Teaser : రీసెంట్ గా కన్నడలో మంచి సెన్సేషన్ హిట్ గా నిలిచిన చిత్రం ‘సప్త సాగరాలు దాటి – సైడ్ ఏ’. ఈ మూవీ కన్నడలో హిట్ అయిన తర్వాత తెలుగు వర్షన్ కూడా రిలీజ్ అయింది. అయితే తెలుగులో ఈ మూవీ ఊహించిన కలెక్షన్లు రాబట్టలేకపోయినా.. మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం సీక్వెల్ సప్త సాగరాలు దాటి సైడ్ బి మూవీ త్వరలో రాబోతున్నట్టు మేకర్స్ స్పష్టం చేశారు. తాజాగా మూవీకి సంబంధించి ఒక అప్డేట్ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఈ మూవీకి సంబంధించిన టీజర్ ని విడుదల చేయడంతో పాటు రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. నిజానికి ఈ మూవీ దసరా పండుగ సందర్భంగా విజయదశమినాడు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినప్పటికీ కుదరలేదు. అందుకే దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురావడానికి అన్ని సన్నాహాలు పూర్తి చేస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తుంది.
నవంబర్ 17 న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీకి సంబంధించిన పార్ట్ వన్ సప్త సాగరాలు దాటి సైడ్ ఏ లో ప్రేమ కథను చూపించడం జరిగింది.. అయితే సైడ్ బీలో కాస్త ఇంటెన్సిటీని పెంచి యాక్షన్ ని కూడా జతచేశారని గ్లింప్స్‌తో తో అర్థమవుతుంది. ఒక్క సింగిల్ టీజర్ తో దర్శకుడు తాను ఏం చెప్పాలనుకున్నారో..దానినే చాలా స్పష్టంగా అర్థం అయ్యేలా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

వీడియో స్టార్టింగ్ లో టేప్రికార్డర్ లో క్యాసెట్ తీసి సైడ్ బి కి తిప్పి పెట్టి పార్ట్ టూ ని చాలా ఇన్నోవేటివ్ గా ఇండికేట్ చేశారు. ప్రస్తుతం మూవీ పార్ట్ వన్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. టీజర్ రక్షిత్ శెట్టి బిల్డింగ్ పై ఒక రాత్రి బయట పడుకొని ఆకాశంలోకి చూస్తూ ఉన్న సీన్ తో ప్రారంభమవుతుంది. అలా ఆలోచిస్తూ అతని మైండ్ లో ప్రేయసి చెప్పిన మాటలు .. జైల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు అన్న సంగతులు మెదులుతూ ఉంటాయి.
ఒక్క టీజర్ లోనే మొత్తం నాలుగు భాషల్లో డైలాగ్స్ పెట్టారు. అంటే అన్ని భాషలకి కలిపి ఒకే ఒక్క టీజర్ ని రూపొందించి చాలా వినూత్నంగా టీజర్ ని కట్ చేశారు. నిజంగా ఈ టీజర్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచడంలో సక్సెస్ అయింది. టీజర్ మంచి ప్రామిసింగ్ ట్రీట్ అందిస్తోంది. మరి మూవీ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో లేదో చూడాలి.