Rakul Preet Singh.. హీరోయిన్స్ సినిమాలలో బిజీగా ఉన్నప్పటికీ కూడా.. అభిమానులకు చేరువలో ఉంటారు. ఇలా ఉండడం కోసం సోషల్ మీడియా ద్వారా ఏదో ఒక విషయాన్ని పంచుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఇంస్టాగ్రామ్ వంటి ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా చిట్ చాట్ నిర్వహిస్తూ అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెబుతూ.. ఎందరికో తెలియని సమాధానాలను కూడా తెలిసేలా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరొక బ్యూటీ కూడా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించి, తన ఆరోగ్యం పై క్లారిటీ ఇవ్వడమే కాకుండా అందరూ ఆరోగ్యం పై దృష్టి పెట్టాలని కోరింది. ఆమె ఎవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).
తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ సినిమా ద్వారా అడుగుపెట్టి “ప్రేరణ.. ప్రతి రూపాయి కౌంటింగ్ ఇక్కడ” అనే డైలాగ్ తో భారీ పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ ముద్దుగుమ్మ, అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకుంది. ఒకవైపు హీరోయిన్ గా చేస్తూనే మరొకవైపు జిమ్ నిర్వహిస్తూ డబ్బు బాగానే సంపాదిస్తోంది. అంతేకాదు పలు యాడ్స్ లలో కూడా మెరుస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా గత కొంతకాలం క్రితం తన బరువు కంటే అధిక బరువును మోసి వెన్ను సమస్య తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో గత కొన్నాళ్లుగా బెడ్ రెస్ట్ తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ . ఈ నేపథ్యంలోనే రకుల్ ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించింది.
ఆరోగ్యంపై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్..
తాజాగా అభిమానులతో ముచ్చటించిన ఈమె తన ఆరోగ్యం గురించి ప్రశ్నించగా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. కానీ ఆరోగ్యం మనకు ఏ మాత్రం సపోర్ట్ చేయకపోయినా వెంటనే పని కల్పించుకొని మరీ వైద్యులను సంప్రదించడం మేలు అంటూ రకుల్ ప్రీత్ సింగ్ సలహా ఇచ్చింది. ఏది ఏమైనా సొంత అనుభవం అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు
వచ్చే ఏడాది నా సినిమాలు విడుదల..
ఈ ఏడాది ఎందుకు ఎక్కువ సినిమాలలో కనిపించడం లేదు అని కూడా అడగగా.. వచ్చే సంవత్సరంలో తను నటించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి అంటూ కూడా తెలిపింది.
నేను చేసిన తప్పు ఇంకొకరు చేయకండి..
అలాగే బరువు గురించి కూడా ప్రశ్నించారు అభిమానులు. ఇక ఆమె మాట్లాడుతూ.. బయట ఫుడ్ తినకూడదని, హెల్తీ లైఫ్ స్టైల్ అలవర్చుకోవాలని తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది. అందుకే వెయిట్ పెరగరు అని కూడా తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఎవరైనా సరే పరిమితిని మించి పనిచేయకూడదు అని, శరీరం మాట వినడం ఆరోగ్యానికి మేలని తెలిపింది. తాను చేసిన తప్పు ఇతరులు చేయొద్దని కూడా సూచించింది. మొత్తానికి అయితే వెన్ను గాయం అయినప్పుడు రెండు వారాలలో తగ్గుతుంది అనుకున్నాను. కానీ 8 వారాలు పట్టిందని, ప్రస్తుతం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను అని కూడా తెలిపింది రకుల్ ప్రీత్ సింగ్. ఏదిఏమైనా రకుల్ ప్రీత్ సింగ్ అధిక బరువు మోయడం వల్లే ఇలా వెన్నునొప్పి వచ్చిందని దానివల్లే ఎంతో ఇబ్బంది పడుతోందని కూడా చెప్పవచ్చు.