Mohammed Shami – Rohit Sharma: టీమిండియా జట్టులో.. అంతర్గత గొడవలు తెరపైకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వర్సెస్ టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ మధ్య గొడవలు జరుగుతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనికి కారణం మహమ్మద్ షమీ ఫిట్నెస్ అని తెలుస్తోంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఫిట్నెస్ పైన కెప్టెన్ రోహిత్ శర్మ రకరకాలుగా స్పందిస్తున్నాడు. ఒకసారి ఫిట్ గా ఉన్నాడని..మరొకసారి ఫిట్ గా లేడని… రోహిత్ శర్మ చెప్పడమే… ఇప్పుడు వివాదంగా మారింది.
Also Read: Sunil Gavaskar: హోటల్‌లో పడుకోవడం మానేయండి…టీమిండియా ప్లేయర్లకు వార్నింగ్ !
వాస్తవంగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో చాలామంది ప్లేయర్లు చాలా స్వేచ్ఛగా ఆడతారని టాక్ ఉంది. దానికి తగ్గట్టుగానే ప్లేయర్ లందరికీ మంచి అవకాశాలు ఇస్తాడు రోహిత్ శర్మ. అచ్చం మహేంద్ర సింగ్ ధోనీ లాగానే… రోహిత్ శర్మ కూడా మ్యాచ్ను డీల్ చేస్తాడు. అందుకే రోహిత్ శర్మ కెప్టెన్సీలో ధోని తరహా లోనే టీమ్ ఇండియాకు విజయాలు వరిస్తున్నాయి.. టి20 ప్రపంచ కప్ కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీలో దక్కించుకుంది టీం ఇండియా.
అయితే అలాంటి రోహిత్ శర్మ గ్రౌండ్లో చాలా యాక్టివ్ గా, అగ్రేసివుగా ప్రవర్తిస్తాడు. ఫీల్డర్ ఏదైనా తప్పు చేస్తే అక్కడే తిట్టేస్తాడు. అయితే… తాజాగా రోహిత్ శర్మ గురించి సంచలన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీని జట్టులోకి రాకుండా రోహిత్ శర్మ కుట్రలు జరుపుతున్నట్లు… కథనాలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగే మరో మూడు టెస్టులకు మహమ్మద్ షమి అందుబాటులోకి వస్తాడని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చర్చ జరిగింది.
కానీ పింక్ బాలు టెస్టులో ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ… మహమ్మద్ షమీ ఫిట్ గా లేనట్లే మాట్లాడారు. సయ్యద్ ముస్తఫ్ ట్రోఫీలో షమీ ఈమధ్య గాయపడ్డాడని… అతన్ని బీసీసీఐ బృందం పరిశీలిస్తోందని తెలిపాడు రోహిత్ శర్మ. అతనికి టీమిండియాలో ఎప్పుడు డోర్స్ ఓపెన్ గానే ఉంటాయని… కానీ ఫిట్నెస్ మాత్రం ముఖ్యమని చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్ శర్మ ఈ ప్రకటన చేయడంతో… వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్టుల సందర్భంగా కూడా రోహిత్ శర్మ ఇలాగే వ్యవహరించాడు. షమికి గాయమైందని… టెస్ట్ సిరీస్ ఆడబోడని రోహిత్ శర్మ తెలిపారు. అయితే అదే సమయంలో NCA అకాడమీ లో ఉన్న.. శమిని రోహిత్ శర్మ కలిశాడు. అప్పుడు రోహిత్ శర్మ పై… ఆగ్రహం వ్యక్తం చేశారట మహమ్మద్ షమీ. తనకు గాయమైందని మీడియాకు ఎందుకు చెప్పావని రోహిత్ శర్మ పై నిప్పులు చెరిగాడట. దీంతో అప్పటినుంచి వీరి మధ్య గొడవలు మొదలయ్యాయని వార్తలు వస్తున్నాయి.