Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh).. ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అయితే పెళ్లి అవ్వడం వల్లనో లేక వేరే ఇండస్ట్రీలో బిజీ అవ్వడం వల్లనో తెలియదు కానీ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ ని ఎవరు పట్టించుకోవడం లేదు.ఇక గత ఏడాది శంకర్ డైరెక్షన్లో వచ్చిన భారతీయుడు 2(Bharateeyudu-2) సినిమాలో సిద్ధార్థ్ (Siddharth)కి జోడిగా నటించింది.కానీ ఈ సినిమా అలా వచ్చి ఇలా వెళ్లిపోవడంతో రకుల్ పాత్రకి అంత గుర్తింపు అయితే దక్కలేదు. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా సోషల్ మీడియాలో క్రియేట్ చేసే పుకార్లపై ఫైర్ అయింది. ఇలాంటి వాటిని ఇంకొకసారి క్రియేట్ చేయకండి..మా నాన్న బాధపడుతున్నాడు అంటూ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)షాకింగ్ కామెంట్లు చేసింది. మరి ఇంతకీ రకుల్ ప్రీత్ సింగ్ ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడిందో ఇప్పుడు చూద్దాం..
మాజీ మంత్రి కూతురు పెళ్లిలో డాన్స్ చేసిన రకుల్..
టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్ హీరోలందరితో జతకట్టిన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెచ్చుకుంది. అలా సౌత్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ తో ఒక ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నార్త్ కు వెళ్ళిపోయింది.ఇక బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసి బాలీవుడ్ నటుడు, నిర్మాత అయినటువంటి జాకీ భగ్నాని(Jacky Bhagnani)ని ప్రేమించి పెళ్లాడింది. వీరి పెళ్లి గత ఏడాది ఫిబ్రవరి 21న జరిగింది.అయితే పెళ్ళై సంవత్సరం కావస్తున్నా ఇప్పటికి ఏ గుడ్ న్యూస్ చెప్పలేదు. ఈ విషయం పక్కన పెడితే..రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి(Gali Janardhan Reddy) కూతురు బ్రాహ్మణి వివాహంలో డ్యాన్స్ పర్ఫామెన్స్ చేసింది. వీరి పెళ్లి బెంగళూరులో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ పెళ్లిలో రకుల్ ప్రీత్ సింగ్ డాన్స్ పర్ఫామెన్స్ చేయడంతో రకుల్ ప్రీత్ సింగ్ పై సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇదే పెళ్లిలో ప్రియమణి,తమన్నా(Priyamani, Tamannaah) వంటి హీరోయిన్లు కూడా డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చినట్టు వార్తలు వినిపించినప్పటికీ, వీరికి సంబంధించిన వీడియోలు మాత్రం బయటకి రాలేదు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ వీడియో బయటకి రావడంతో సోషల్ మీడియాలో రకుల్ ప్రీత్ సింగ్ పై నెగెటివిటీ పెరిగిపోయింది.అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఆ పెళ్లిలో డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో లెక్కకు మించి రెమ్యూనరేషన్ ఇవ్వడం వల్లే ఆ పెళ్లిలో చిందులేసింది అని కొంతమంది అంటే, మరి కొంతమందేమో ఈ డ్యాన్స్ పర్ఫామెన్స్ చేశాక రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ దాడులు కూడా జరిగాయి అంటూ పుకార్లు పుట్టించారు.
పుకార్లపై మా నాన్న కృంగిపోతున్నారు.. రకుల్..
అయితే ఈ పుకార్లపై చిర్రెత్తుకుపోయిన రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఈ రూమర్లపై ఫైర్ అయింది. రకుల్ ప్రీత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి నీచమైన రూమర్లు క్రియేట్ చేయకండి.. ఒకరేమో నా రెమ్యూనరేషన్ కి మూడింతలు రెమ్యూనరేషన్ ఇస్తే డ్యాన్స్ చేశానంటే, మరి కొంత మందేమో నాపై ఐటి దాడి జరిగింది అంటూ ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు నాపై రూమర్లు పుట్టిస్తున్నారు. ఈ రూమర్లన్నీ వింటూ ఉంటే నాకు చాలా కోపం వస్తుంది. కానీ మా నాన్న మాత్రం చాలా బాధపడుతున్నారు. ఇలాంటి పుకార్లు వ్యాప్తి చెందించే ముందు అసలు నిజం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం లేదా.. కనీసం ఈ వార్తలు వైరల్ చేసిన ఏ ఒక్కరు కూడా నన్ను ఈ విషయం గురించి అడిగి నిజం ఏంటో తెలుసుకోకుండానే వాటిని స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ అందులో అసలు నిజం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు.. ఏ విషయంలోనైనా సరే నేను మీడియాతో చాలా ఓపెన్ గా మాట్లాడుతాను. అందుకే ఈ విషయం గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను.ఇలాంటి వార్తలు రాసేముందు నన్ను అడగండి.నా లైఫ్ లో జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని మీతో షేర్ చేసుకున్నాను. నాపై ఏమైనా సందేహాలు ఉంటే నన్నే అడగండి.కానీ ఇలాంటివి రాయకండి ప్లీజ్.. అయినా మీరు ఈ వార్తలను ఎందుకు వదిలిపెట్టడం లేదో నాకు అర్థం అవ్వడం లేదు అంటూ మీడియాపై, ఇలాంటి రూమర్లు ప్రచారం చేసే వారిపై ఫైర్ అయింది రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh). ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.