Thandel Piracy : ఇటీవల కాలంలో పెద్ద సినిమాలను పైరసీ భూతం వెంటాడుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే పైరసీ వెర్షన్ అందుబాటులోకి రావడం పట్ల నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత శుక్రవారం రిలీజైన ‘తండేల్’ (Thandel) మూవీ కూడా తాజాగా పైరసీ బారిన పడింది. ఈ విషయం తెలిసిన మూవీ నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu) సోషల్ మీడియా వేదికగా సదరు పైరసీ రాయుళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
బస్సులో ‘తండేల్’ పైరసీ వెర్షన్
అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన సర్వైవ ల్ థ్రిల్లర్ ‘తండేల్’ (Thandel). ఫిబ్రవరి 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాను తాజాగా బస్సులో ప్రదర్శించడంపై నిర్మాత బన్నీ వాసు రియాక్ట్ అయ్యారు. ఆ సంస్థ చైర్మన్ కు ఈ విషయాన్ని తెలియజేస్తూ స్పెషల్ పోస్ట్ పెట్టారు.
“సోషల్ మీడియా ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో తండేల్ మూవీని ప్రదర్శించారనే విషయాన్ని తెలుసుకున్నాము. ఇది చట్ట విరుద్ధం, అన్యాయం… ఇలా చేయడం ఓ సినిమాకు జీవం పోయడానికి కృషి చేసిన ఎంతో మంది వ్యక్తులను అవమానించడమే అవుతుంది. ఒక సినిమా అనేది ఎంతో మంది ఆర్టిస్టులు, దర్శకనిర్మాతల కల. ఇలా పైరసీకి పాల్పడిన వారిపై ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు కఠిన చర్యలు తీసుకోవాలని తీసుకోవాలని కోరుతున్నాం” అంటూ బన్నీ వాసు చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
అందులో బన్నీ వాసు “ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. పైరసీకి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకుని, మళ్లీ ఇలాంటి పనులు జరగకుండా బలమైన ఉదాహరణగా నిలవాలని నేను కోరుతున్నాను” అంటూ ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు.
పైరసీ చేస్తే జైలుకే…
డైరెక్టర్ చందూ మొండేటి (Chandu Mondeti) దర్శకత్వంలో రూపొందిన ‘తండేల్’ మూవీ గత శుక్రవారం రిలీజ్ కాగా, గంటల వ్యవధిలోనే పైరసీ వెర్షన్ లీక్ అయ్యింది. ఇక రీసెంట్ గా ఓ లోకల్ ఛానల్ లో కూడా ఈ మూవీని ప్రదర్శించడంతో బన్నీ వాసు డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చారు. “పైరసీ మూవీ వస్తుంది కాబట్టి చూసేద్దామని చాలా మంది అనుకుంటారు. ‘గీత గోవిందం’ మూవీని పైరసీ చేసిన వారు, ఆ కేసులో జైలు కెళ్ళి ఇప్పుడిప్పుడే కొందరు బయటకు వస్తున్నారు. గీతా ఆర్ట్స్ సినిమాలను ఎవరైతే పైరసీ చేస్తారో వాళ్లను మాత్రమే కాదు, వాటిని డౌన్లోడ్ చేసుకుని చూసిన వారిని కూడా వదలం” అని పేర్కొన్నారు బన్నీ వాసు. ‘గేమ్ ఛేంజర్’ మూవీ విషయంలో కూడా ఇలాగే షాకింగ్ ఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ‘తండేల్’ మూవీ భారీ కలెక్షన్స్ రాబడుతోంది. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే ఈ మూవీ 60 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి, 50 కోట్ల క్లబ్ లో చేరింది.
We have come to know from @Way2NewsTelugu that an @apsrtc bus (Service No: 3066) played a pirated version of our #Thandel.. This is not only illegal and outrageous but also a blatant insult to the countless individuals who worked tirelessly to bring this film to life. The movie…
— Bunny Vas (@TheBunnyVas) February 10, 2025