Ram Charan-Allu Arjun: గత కొన్నాళ్లుగా అల్లు మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలున్నట్టుగా.. వార్తలు వైరల్ అవుతునే ఉన్నాయి. గత ఎన్నికల్లో అల్లు అర్జున్ జనసేనకు కాకుండా.. వైసీపీకి సపోర్ట్ చేయడంతో అల్లు వర్సెస్ మెగా వార్ పీక్స్‌కు చేరుకుంది. నాగబాబు చేసిన ట్వీట్‌కు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొట్టుకున్నంత పని చేశారు. కానీ తర్వాత పవన్, బన్నీ ఈ విషయం పై కూల్‌గా స్పందించారు. ప్రస్తుతానికైతే.. అల్లు, మెగా హీరోలు ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ ఫ్యామిలీ హీరోలు కలిసిన సందర్భాలు లేవు. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ రామ్ చరణ్ మాత్రం కలిసే ఛాన్స్ లేకపోలేదు. ఈ ఇద్దరి సినిమాల పనులు ఒకే చోట జరుగుతున్నాయి. ఇదే ఇప్పుడు ఈ ఇద్దరు కలుస్తారా? అనే దానికి ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది.
బన్నీ-అట్లీ.. సిట్టింగ్ అక్కడే?
పుష్ప 2 తర్వాత ఐకాన్ స్టార్.. త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమాను భారీగా ప్లాన్ చేస్తున్నారు. మైథలాజికల్ టచ్‌తో భారీ బడ్జెట్‌తో రూపొందిచనున్నారు. ఊహకందని విధంగా ఈ సినిమాను డిజైన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. దీంతో కాస్త సమయం పట్టేలా ఉంది. అందుకే.. అట్లీతో కమిట్ అయ్యాడు అల్లు అర్జున్ (Allu Arjun). అసలే పుష్ప2తో చాలా గ్యాప్ ఇచ్చాడు బన్నీ. ఇక పై గ్యాప్ రాకుడదని భావించి ముందు అట్లీ సినిమా మొదలు పెట్టబోతున్నాడు. ఇప్పటికే అట్లీ టీమ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉంది. అయితే.. ఈ సినిమా పనులు ఇండియాలో జరగడం లేదు. ఇక్కడ చేయడం వల్ల ఎలాగో అలా లీకులు జరుగుతున్నాయని భావించిన టీమ్.. దుబాయ్‌కి షిప్ట్ అయ్యారు. అల్లు అర్జున్ కూడా ఇప్పటికే రెండు మూడు సార్లు దుబాయ్‌కి వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం అట్లీ అక్కడే ఉన్నట్టు టాక్.
చరణ్-సుకుమార్ కూడా అక్కడే?
ప్రజెంట్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేస్తున్న రామ్ చరణ్.. నెక్స్ట్ సుకుమార్‌తో ఆర్సీ 17 చేయడానికి రెడీ అవుతున్నాడు. రంగస్థలం తర్వాత రిపీట్ అవుతున్న ఈ కాంబినేషన్ పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. చిట్టిబాబుకి మించిన పాత్రను డిజైన్ చేస్తున్నాడు సుక్కు. పుష్ప2 తర్వాత కాస్త రిలాక్స్ అయిన సుకుమార్.. ఈ మధ్య దుబాయ్‌లో కొత్త ఆఫీస్ ఓపెన్ చేసినట్టుగా ఇటీవల చెప్పుకొచ్చారు. మామూలుగా అయితే.. ఇంతకు ముందు ఇండియాలోనే సుకుమార్ సిట్టింగ్స్ ఉండేవి. కానీ ఈసారి మాత్రం దుబాయ్ షిప్ట్ అవుతున్నట్టుగా చెబుతున్నారు. ఆర్సీ 17 ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా అక్కడే జరగనుందని అంటున్నారు. దీంతో.. బన్నీ, చరణ్ సినిమాలు ఒకే చోట వర్క్ జరుగుతుండడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసే ఛాన్స్ ఉందా? అనేది మరింత ఆసక్తికరంగా మారింది.
ముందు బన్నీ, తర్వాత చరణ్?
అల్లు అర్జున్, రామ్ చరణ్ (Ram Charan) మధ్య బేదాభిప్రాయాలు ఉన్నాయని అభిమానులు అనుకోవడం లేదు. ఈ ఇద్దరి మధ్య మంచి సంబంధాలున్నాయి. కాబట్టి.. ఇద్దరు ఒకేసారి దుబాయ్ వెళ్తే కలిసే ఛాన్స్ ఉంది. పైగా ఇద్దరి మధ్య సుకుమార్ ఉంటాడు కాబట్టి.. ఈ ముగ్గురి మీటింగ్ గ్యారెంటీ. కానీ ఆర్సీ 17 కోసం చరణ్ లేట్‌గా దుబాయ్‌కి వెళ్లనున్నాడు. ఈలోపు బన్నీ-అట్లీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేలా ఉంది. ఇద్దరి సినిమాల సిట్టింగ్స్ దుబాయ్‌లోనే జరిగిన.. ఒకరు ముందు వెళ్లనున్నారు, మరొకరు తర్వాత వెళ్లనున్నారు. ఈ లెక్కన ఈ ఇద్దరు ఎదురు పడే అకశాలు తక్కువ. ఒకవేళ పడితే మాత్రం.. మెగా అల్లు అభిమానులకు అంతకుమించిన కిక్ మరోటి ఉండదనే చెప్పాలి.