OTT Movie : కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ తో పాటు, మంచి మెసేజ్ కూడా ఇస్తుంటాయి. సమాజంలో స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఒక వ్యక్తి కి ముగ్గురు కూతుర్లు పుడతారు. ఈసారి అబ్బాయి కావాలని, మరోసారి అమ్మాయిని కంటాడు. వారసుడి మీద ఆశతో, ఆమెను చిన్నప్పటి నుంచి అబ్బాయిలాగా పెంచుతాడు. ఆ తర్వాత స్టోరీ మరో మలుపు తీసుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ మూవీ పేరు ‘కిస్సా: ది టేల్ ఆఫ్ ఎ లోన్లీ ఘోస్ట్’ (Qissa: The Tale of a Lonely Ghost). 2013 లో విడుదలైన ఈ మూవీకి అనుప్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ భారతదేశ విభజన సమయంలో జరిగే కథగా తెరకెక్కించారు. ఈ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్, తిలోత్తమ షోమ్, తిస్కా చోప్రా, రసికా దుగ్గల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
ఈ మూవీ స్టోరీ 1947లో భారతదేశ విభజన సమయంలో జరుగుతూ ఉంటుంది. ఉంబర్ సింగ్ అనే వ్యక్తి తన భార్య, ముగ్గురు ఆడ పిల్లలతో కలిసి, అతడు నివసించే గ్రామం నుంచి వెళ్లి పోవాల్సి వస్తుంది. అలా మరో చోటికి వెళ్ళాక వంశోద్ధారకుడు కోసం మళ్లీ ప్రయత్నిస్తాడు ఉంబర్ సింగ్. ఇదివరకే ముగ్గురు ఆడపిల్లలు ఉండటంతో, మళ్లీ ఇతనికి ఆడపిల్ల పుడుతుంది. ఇక చేసేదేం లేక ఆమెను మగవాడిగా పెంచాలనుకుంటాడు. ఆమెకు పేరుకూడ కన్వర్ సింగ్ అనే అబ్బాయి పేరు పెడతాడు. ఆమెకు మగవాడి లాగానే దుస్తులు ధరించి, అమ్మాయి లక్షణాలు రాకుండా పెంచుతూ ఉంటాడు ఉంబర్ సింగ్. వయసు పెరిగే కొద్దీ ఆమెలో గందరగోళం ఏర్పడుతుంది. తాను అమ్మాయా, అబ్బాయా అనే ఆలోచనలో పడుతుంది. ఇది ఇలా ఉంటే ఉబర్ సింగ్, కన్వర్ కి పెళ్లి చేయాలనుకుంటాడు.
ఇదంతా బాగానే ఉన్నా, పెళ్లి మాత్రం ఒక అమ్మాయి తోనే జరిపిస్తాడు. పెళ్లి జరిగాక కన్వర్ అబ్బాయి కాదు అమ్మాయి అని తెలిసిపోతుంది. ఇదే ఆమె జీవితానికి, కుటుంబానికి పెద్ద మచ్చ తెచ్చి పెడుతుంది. ఆ తర్వాత స్టోరీలో చాలా మార్పులు జరుగుతాయి. చివరికి కన్వర్ అబ్బాయి లాగానే ఉంటుందా? తన జీవితాన్ని ఎలా సరిదిద్దుకుంటుంది? తన తండ్రి దీని నుంచి ఏం నేర్చుకుంటాడు. ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఇందులో ఇర్ఫాన్ ఖాన్ తన నటనతో ప్రేక్షకుల్ని మైమరిపించాడు. తిలోత్తమ సున్నితమైన నటన, అనూప్ సింగ్ దర్శకత్వ ప్రతిభ ఈ మూవీని విజయం వైపు నడిపించాయి. ఈ మూవీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రశంసలు అందుకుంది.