Ram Charan – Allu Arjun : మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. వరుస హిట్ సినిమాలతో మెగా హీరోల హవా కొనసాగుతుంది.. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల సినిమాలు ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ ఏ రేంజులో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు రామ్ చరణ్ కూడా ట్రిపుల్ ఆర్ మూవీతో ఏకంగా ఆస్కార్ వరకు వెళ్ళాడు. అయితే మెగా హీరోలతో కాంభో మూవీ వస్తే బాగుండు అని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. కానీ ఫ్యాన్స్ కోరిక ఇప్పటిలో తీరేలా కనిపించలేదు.. ఇంతకీ ఫ్యాన్స్ ఎవరిని కోరుకుంటున్నారంటే.. అల్లు అర్జున్, రామ్ చరణ్.. వీరిద్దరితో ఒక తీస్తే చూడాలని ఆశ పడుతున్నారు. గతంలో ఎవడు వచ్చింది. కానీ కలిసి రాలేదని అంటున్నారు. వీరిద్దరితో సినిమా తీసే గట్స్ ఆ డైరెక్టర్ కు మాత్రమే ఉందట.. ఎవరు ఆ డైరెక్టర్ చూద్దాం..
మెగా వారసుడుగా అడుగు పెట్టిన రామ్ చరణ్ కెరీర్ ప్రారంభంలో వీళ్ళిద్దరూ ఎన్నో అవమానాలు, ట్రోల్స్ ఎదుర్కొన్నా.. తమ టాలెంట్‌తో మెల్లమెల్లగా ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో సత్తా చాటుతున్నారు… మగధీర, రంగస్థలం లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్.. ఆర్ఆర్ఆర్ లాంటి సెన్సేషనల్ హిట్ తో ఇంటర్నేషనల్ రేంజ్ లో ఇమేజ్ తెచ్చుకున్నాడు.. ఆస్కార్ ఆయన జీవితాన్నే మార్చేసింది..
ఇక అల్లు అర్జున్ కూడా చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిపించుకుంటూ టాప్ హీరో అయ్యాడు. పుష్ప సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న బన్నీ.. ఈ సినిమాతో నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. దీని తర్వాత తాజాగా రిలీజ్ అయిన పుష్ప 2తో ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరి కెరీర్‌లో ఎదిగిన తీరు.. ఎంతోమందికి ఆదర్శం. ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్, రామ్ చరణ్ లను పెట్టి ఓ క్రేజీ మూవీని ప్లాన్ చేస్తున్నారట బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్.. ఈ క్రేజీ ప్రాజెక్టుకి అట్లీ దర్శకుడని సమాచారం. గతంలో ఈ కాంబోలో ఎవడు సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో బన్నీ కేవలం చాలా తక్కువ సమయం మాత్రమే ప్రత్యేక రోల్ లో కనిపించాడు. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న ఈ ఇద్దరితో ఫుల్ లెన్త్ మూవీని తీస్తే బాగుండునని అనుకున్నారట. మరి ఆ కోరిక నేర వేరుతుందో లేదో చూడాలి.. ప్రజెంట్ ఉన్న పరిస్థితులలో ఈ మూవీ వస్తుంటేనే ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషి అవుతున్నారు.. చూద్దాం ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో..