BigTV English
Advertisement

OTT Movie : ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఇరుక్కుపోయిన ప్రేమికుడు… చుక్కలు చూపించే ప్రియురాలు

OTT Movie : ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఇరుక్కుపోయిన ప్రేమికుడు… చుక్కలు చూపించే ప్రియురాలు

OTT Movie : యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలు చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు మూవీ లవర్స్. ఈ సినిమాలలో లవ్ కంటెంట్ యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వచ్చే సినిమాలు ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయి. అటువంటి లవ్ స్టోరీ తో ఒక మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? వివరాల్లోకి వెళితే…


నెట్ఫ్లిక్స్ (Netflix)

ఈ అమెరికన్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ పేరు ‘యు గెట్ మీ‘ (You get me). ఈ మూవీలో ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపే ప్రియుడికి, ఒక సైకో ప్రియురాలు చుక్కలు చూపిస్తుంది. ఆ ప్రియురాలు నుంచి ప్రియుడు ఎదుర్కొనే సమస్యలతో స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

టేలర్, అలిసన్ ఇద్దరూ ప్రేమించుకుంటూ హ్యాపీగా ఉంటారు. టేలర్ బీచ్ దగ్గర ఒక హోటల్లో పని చేస్తూ చదువుకుంటూ ఉంటాడు. ఒకరోజు వీళ్లిద్దరూ ఒక పార్టీకి వెళ్తారు. ఆ పార్టీలో అలిసన్ ఒకప్పుడు చాలామంది తో తిరిగిందని టేలర్ తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని అలిసన్ దగ్గర ప్రస్తావిస్తాడు. ఒకప్పుడు అలా ఉండేదాన్ని, అయితే ఇప్పుడు నీ ప్రేమలో పడ్డాక చాలా మారిపోయాను అంటూ సమాధానం చెబుతుంది అలిసన్. హీరో ఆమె మీద కోపంతో అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఈ క్రమంలో హెలి అనే అమ్మాయి హీరోకి దగ్గరవుతుంది. టేలర్ కు డ్రగ్స్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్లి ఏకాంతంగా గడుపుతుంది. ఈమె చాలా ధనవంతురాలు అయినా గాని, ఆమెకు మానసికంగా ఒక సమస్య ఉంటుంది. ఆ తర్వాత టేలర్ అలిసన్ తో మాట్లాడి మళ్లీ ప్రేమలో మునుగుతాడు. ఎందుకంటే వీళ్ళిద్దరూ హార్ట్ ఫుల్ గా ప్రేమించుకుంటూ ఉంటారు. హెలి, టేలర్ ని ఎక్కువగా ప్రేమించడంతో అతన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలో టేలర్ గర్ల్ ఫ్రెండ్ అలీసన్ తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఎంతలా అంటే టేలర్ తో ఆమె సమయాన్ని గడపనిచ్చేది కాదు.

కాస్త ముందుకెళ్లి నాతో టేలర్ ఏకాంతంగా గడిపాడని అలీసన్ కి చెప్తుంది. టేలర్ కి ఏ రకంగానూ మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆమెను ఒకసారి ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని, గట్టిగా నేలకేసి తోయడంతో ఇంకాస్త పగ పెంచుకుంటుంది. అలిసన్ ని కిడ్నాప్ చేసి చంపాలని చూస్తుంది. టేలర్, అలీసన్ ను విడిపించే ప్రయత్నం చేస్తాడు. హేలీ గన్ తీసుకొని అలిసన్ ని చంపేస్తే మనిద్దరం కలిసి ఉండొచ్చని షూట్ చేస్తుంది. బుల్లెట్ టేలర్ కి తగులుతుంది. ఎలిసన్ హేలీని కత్తితో గాయపరుస్తుంది. హాస్పిటల్ కి వెళ్ళాక వీళ్లిద్దరూ కొలుకుంటారు. మరోవైపు హెలి తన మానసిక ప్రాబ్లం తో పోలీస్ ఆఫీసర్ ని నన్ను విడిచి వెళ్ళకు అని చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె మరొకరిని టార్గెట్ చేసింది అన్నమాట. చివరికి హేలి ఎందుకలా తయారైంది? టేలర్ ప్రియురాలతో సంతోషంగా ఉంటాడా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీనీ తప్పకుండా చూడండి.

Related News

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి స్టార్ హీరోల సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Phaphey Kuttniyan OTT : అందంగా దోచుకునే అమ్మాయిలు… కామెడీ మూవీకి క్రైమ్ ట్విస్ట్… 3 నెలల తరువాత ఓటీటీలోకి

Mithra Mandali OTT : ఓటీటీలోకి ‘మిత్రమండలి’… రీ-లోడెడ్ వెర్షన్ వర్కౌట్ అవుతుందా ?

November 2025 OTT releases : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నుంచి ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ వరకు… ఈ నెల ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సిరీస్ లు

OTT Movie : ‘గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ కంటే ముందు చూడాల్సిన రష్మిక మందన్న టాప్ 5 మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

Big Stories

×