BigTV English

RR vs DC IPL 2024 Preview: రాజస్థాన్ నెంబర్ వన్ అవుతుందా? నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్

RR vs DC IPL 2024 Preview: రాజస్థాన్ నెంబర్ వన్ అవుతుందా? నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్

RR vs DC Dream11 Prediction IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభమైన తర్వాత చాలా కాలం నెంబర్ వన్ గా ఉన్న రాజస్థాన్ ఉన్నట్టుండి నెంబర్ 2 కి వెళ్లి పోయింది. నేడు ఢిల్లీ క్యాపిటల్స్ తో అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30కి జరగనున్న మ్యాచ్ లో గెలిస్తే మళ్లీ నెంబర్ వన్ అవుతుంది.


ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్ 8 మ్యాచ్ లు గెలిచి 16 పాయింట్లతో టాప్ 2 లో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్ లు ఆడి 5 మ్యాచ్ లు గెలిచింది. పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 28 మ్యాచ్ లు జరిగాయి. ఢిల్లీ 13 మ్యాచ్ ల్లో విజయం సాధిస్తే, రాజస్థాన్ 15 గెలిచింది.

రాజస్థాన్ విషయానికి వస్తే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగులో పటిష్టంగా ఉండటం, అందరూ భీకర ఫామ్ లో ఉండటంతో మ్యాచ్ లను అవలీలగా గెలుస్తున్నారు. ఓపెనర్ గా యశస్విజైశ్వాల్ ఫామ్ అందుకున్నాడు. మ్యాచ్ లను గెలిపిస్తున్నాడు. జాస్ బట్లర్, కెప్టెన్ సంజూ శాంసన్, రియాన్ పరాగ్, అందరూ అదరగొడుతున్నారు.


Also Read:  సూర్యకుమార్ సెంచరీ.. ముంబై గెలుపు హైదరాబాద్ కు ఆశాభంగం

ఇక బౌలింగు విషయానికి వస్తే ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, అశ్విన్, చాహల్, ఆవేశ్ ఖాన్ అందరూ పకడ్బందీగా బౌలింగు చేసి ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే మొదట్లో ఓటమి బాటలో నడిచి, ఇప్పుడే పికప్ అందుకుంది. మరి దాన్ని ముందుకు తీసుకువెళుతుందా? లేక పంజాబ్ లా ఆగిపోతుందో తెలీదు. అయితే ఢిల్లీ జట్టులో జేక్ ఫ్రేజర్ , అభిషేక్ పొరెల్, షయ్ హోప్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్ అందరూ బాగా ఆడుతున్నారు.

బౌలింగు విషయానికి వస్తే ముఖేష్ కుమార్, ఖలీల్, అక్షర్ పటేల్, కులదీప్ అందరూ మంచి ప్లేయర్లే ఉన్నారు. ఒకొక్కసారి ప్రత్యర్థులను కంట్రోల్ చేస్తున్నారు. ఒకొక్కసారి పట్టు వదిలేస్తున్నారు. దీని ఇంపాక్ట్ బ్యాటర్లపై పడుతోంది. అది వారికి భారంగా మారి కొన్ని పరాజయాలను అందుకుంది. ఈసారి మరి రెండు జట్లు ఎలా ఆడతాయో, ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే.

Tags

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×