BigTV English

Harsha Vardhan: ప్రేమించిన అమ్మాయి వేరొకరితో అలా.. ఇప్పటికీ నేను ఒంటరిగానే ఉన్నా..

Harsha Vardhan: ప్రేమించిన అమ్మాయి వేరొకరితో అలా.. ఇప్పటికీ నేను ఒంటరిగానే ఉన్నా..

Harsha Vardhan: సినీ నటుడు హర్షవర్ధన్ గురించి అందరికీ తెలుసు. సినీ నటుడుగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్నాడు. అమృతం అనే డైలీ సీరియల్ తో బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. సీరియల్స్ తో కెరియర్ ప్రారంభించిన ఈ నటుడు సినిమాలతో బాగా పాపులర్ అయ్యాడు . రీసెంట్ గా నాని నిర్మించిన కోర్టు మూవీలో ప్రత్యేక పాత్రలో నటించి అందర్నీ ఆకట్టుకున్నాడు. కెరియర్ పరంగా సక్సెస్ఫుల్ ట్రాక్ ఇన్ మైంటైన్ చేస్తున్న హర్షవర్ధన్ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఒంటరిగానే ఉంటున్నాడు. ఆయన ఇప్పటివరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదో అన్న విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఆయన అసలు పెళ్లి ఎందుకు చేసుకోలేదు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


ఏడేళ్లు ప్రేమించాను..

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హర్షవర్ధన్ మాట్లాడుతూ.. సినిమాల పైన మంచి సక్సెస్ అయ్యాను. కానీ నిజ జీవితంలో ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నానని బయటపెట్టారు. ఆయన వివాహబంధానికి నేను పెద్ద అభిమానిని. కానీ ఓ అమ్మాయి వల్ల లవ్‌ ఫెయిలై పెళ్లి జోలికి వెళ్లాలనుకోవడం లేదు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించాను. దాదాపు గా ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్నాం. ఎన్నడూ ఐ లవ్యూలు చెప్పుకోలేదు. పెళ్లయిన తర్వాత మేము పిల్లల్ని కనకుండా అనాధాశ్రమం నుండి ముగ్గురు పిల్లని దత్తత తీసుకోవాలని అనుకున్నాం. నా అభిప్రాయాలు విన్న అమ్మాయి సడన్గా ఒక రోజు కనిపించకుండా పోయింది. నేను స్టేజీపై ఒక అవార్డు తీసుకుంటున్న సమయంలో తన పెళ్లయిపోయిందని తెలిసింది. నిజానికి రెండు నెలలుగా తన వైపు నుంచి నాకు ఫోన్‌ రాలేదు. పని బిజీలో పడిపోయి ఆ సంగతే మర్చిపోయాను. నేను తనకి టైం ఇవ్వకపోవడం వల్లనే తను నన్ను వదిలేసిందని బాగా ఫీలయ్యానని ఆయన అన్నారు. ఆ అమ్మాయి చేసిన దానికి ఆ తర్వాత అమ్మాయిలు మీదే విరక్తి కలిగేలా మారింది. అందుకే ఇప్పటికీ 50 ఏళ్లు వచ్చినా కూడా నేను ఒంటరిగానే ఉంటున్నానని, హర్షవర్ధన్ తన నిజ జీవితంలో జరిగిన విషయాలను పంచుకున్నారు.. ఒక సందర్భంలో పిల్లల్ని దత్తత తీసుకోవాలని అనుకున్నాను కానీ వాళ్ళని చూసుకోవడానికి నా టైం సరిపోతుంది ఇక వాళ్ళని ఎలా పెంచి పోషించాలి అని ఆలోచించి, ఆ ఆలోచనని విరమించుకున్నాను. అని ఆయన అన్నారు.


Also Read : పవన్ కళ్యాణ్ ‘ వీరమల్లు ‘ చూడటానికి గల 5 కారణాలు..!

సినిమాల విషయానికొస్తే.. 

నటుడు హర్షవర్ధన్ సినిమాల్లో కీలకపాత్రలో నటిస్తూనే మరోవైపు సీరియల్స్ లో కూడా నటిస్తూ వచ్చాడు. ఇప్పుడు సినిమాలపై ఫోకస్ పెట్టి వరుస సినిమాలను లైన్లో పెట్టుకున్నారు. 3, మనం, చిన్నదాన నీకోసం, గురు, తిక్క చిత్రాలకు డైలాగ్స్‌ రాశాడు. గుండె జారి గల్లంతయ్యిందే మూవీకి రచయితగా పని చేశాడు. మామా మశ్చీంద్ర చిత్రంతో దర్శకుడిగానూ మారాడు. నటుడిగా.. పౌర్ణమి, 3, జోష్‌, లీడర్‌, గీతాంజలి, ఆగడు, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, అంటే సుందరానికి, హిట్‌: 2, మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి, సరిపోదా శనివారం వంటి సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×