E-Paper
Advertisement

Game Changer Teaser Update : టీజర్‌తో గేమ్ మొత్తం ఛేంజ్… ఫ్యాన్స్‌ కోరుకునే స్టఫ్ వచ్చేస్తుంది..

Game Changer Teaser Update : టీజర్‌తో గేమ్ మొత్తం ఛేంజ్… ఫ్యాన్స్‌ కోరుకునే స్టఫ్ వచ్చేస్తుంది..
Advertisement

Game Changer Teaser Update : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్ ‘.. ట్రిపుల్ ఆర్ తర్వాత రాబోతున్న ఈ మూవీ పై ఇండస్ట్రీ లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను డిసెంబర్ లో చూస్తామని అనుకున్నారు. షూటింగ్ కాస్త పెండింగ్ ఉండటంతో సినిమాను సంక్రాంతికి వాయిదా వేశారు. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ కొలీవుడ్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీని తెరకేక్కిస్తున్నారు. ఈ సినిమా రెండు నెలల్లో రిలీజ్ కాబోతుంది. కానీ సినిమాకు హైప్ క్రియేట్ అవ్వలేదు. ఎప్పుడో సాంగ్స్ రిలీజ్ చేసి సైలెంట్ అయ్యారు. కానీ ఎన్ని పండుగలు పోయాయి.. ఈ చిత్రం నుంచి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. ఈ విషయంపై కోపంగా ఉన్న ఫ్యాన్స్ ను బుజ్జగించేందుకు శంకర్ టీజర్ అప్డేట్ ను ఇచ్చాడు.. అది రిలీజ్ అయ్యేవరకు డౌట్ అంటున్నారు ఫ్యాన్స్.. ఆ టీజర్ వస్తుందనే వార్త వినగానే ఫ్యాన్స్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.

కాగా రీసెంట్ గా గేమ్ ఛేంజర్‌ టీజర్ డేట్ లాక్ అయింది. నవంబర్ 9న టీజర్ లాంచ్ ఈవెంట్ లక్నోలో జరగనుంది. గేమ్ ఛేంజర్‌ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు రామ్‌ చరణ్, ఎస్ శంకర్‌ సహా టీమ్ మొత్తం హాజరవనుంది. లాంచ్ ఈవెంట్‌ భారీ ఎత్తున ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు మూవీ రానుండగా.. రెండు నెలల ముందే టీజర్‌ను రిలీజ్ చేయడానికి మూవీ టీమ్ రెడీ అవుతుంది. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, అలాగే రెండు పాటలు ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి.

Advertisement

ఇక త్వరలోనే టీజర్ రాబోతుంది. 2 నిమిషాల కంటే కాస్త తక్కువగా ఉన్న ఆ టీజర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. రామ్ చరణ్ కు ఓ బ్లాక్ బస్టర్ లోడ్ అవుతుందని అనిపిస్తుంది. శంకర్ బిగ్ కం బ్యాక్ మూవీ అవుతుందని తెలుస్తుంది. రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాకు భారీ హైప్ ను క్రియేట్ చేసే ప్లాన్ లో శంకర్ ఉన్నారని తెలుస్తుంది. మరి ఈ మూవీ నుంచి రాబోతున్న టీజర్ ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీ పొలిటికల్‌, యాక్షన్‌ నేపథ్యం లో సాగే పవర్‌ఫుల్‌ కథాంశంతో తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటికే చరణ్ షూటింగ్ పూర్తయింది. బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ హీరోయిన్‌. అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌జె సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ బుచ్చి బాబుతో సినిమా చేస్తున్నాడు.. ఆ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×