BigTV English

Bigg Boss 8 Telugu Promo: మెగా చీఫ్ కంటెండర్ అవ్వాలంటే బరువైన సంచి మోయాల్సిందే! ఇంతకీ ఆ మిస్టరీ సూట్‌కేసులో ఏముంది?

Bigg Boss 8 Telugu Promo: మెగా చీఫ్ కంటెండర్ అవ్వాలంటే బరువైన సంచి మోయాల్సిందే! ఇంతకీ ఆ మిస్టరీ సూట్‌కేసులో ఏముంది?

Bigg Boss 8 Telugu Latest Promo: గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన సూట్‌కేసుల్లో ఏముందో తెలియకుండానే రిస్క్ తీసుకొని వాటిని తమ చేతుల్లోకి తీసుకున్నారు నబీల్, పృథ్వి, రోహిణి. అలా మెగా చీఫ్ కంటెండర్లు అయ్యారు. ఆ కంటెండర్‌షిప్‌ను వేరే కంటెస్టెంట్స్ లాక్కెళ్లిపోకుండా కాపాడుకున్నారు. అంతే కాకుండా ఈ ముగ్గురు.. మరో ముగ్గురికి మెగా చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశం ఇచ్చారు. అలా మెగా చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశం ప్రేరణ, యష్మీ, విష్ణుప్రియాకు వచ్చింది. ఇప్పుడు ఈ ముగ్గురు తమ మెగా చీఫ్ కంటెండర్‌షిప్‌ను కాపాడుకోవాలి. దానికోసం బరువైన సంచిని మోయాలి.


బరువైన సంచితో యుద్ధం

‘‘ప్రేరణ, యష్మీ, విష్ణుప్రియా.. నిన్న మీరు ముగ్గురూ ఆరేంజ్ సూట్‌కేసులను పొంది కంటెండర్‌షిప్‌ను పొందారు. ఇప్పుడు మీరు ముగ్గురు మీలో మీరు తలపడి కంటెండర్‌షిప్‌ను కాపాడుకోవాలి’’ అని బిగ్ బాస్ చెప్పడంతో ప్రోమో మొదలవుతుంది. ఈ ముగ్గురికీ బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్.. ‘బరువైన సంచి’. ఇందులో ముగ్గురు కంటెస్టెంట్స్.. ముందుగా ఒక ఇసుక నింపిన సంచిని పట్టుకొని ఇసుక టనెల్‌ను దాటాలి. ఆ తర్వాత స్వి్మ్మింగ్ పూల్‌లో దూకి ఒకవైపు నుండి మరోవైపుకు వెళ్లాలి. చివరిగా కొంచెం దూరంలో నిలబడి ఆ బరువైన సంచిని టేబుల్‌పై పడేలా విసిరేయాలి. అలా టాస్క్ ముగిసేవరకు చేస్తూనే ఉండాలి.


Also Read: పృథ్వి, విష్ణు మధ్య చిచ్చుపెట్టిన బిగ్ బాస్.. ఇప్పుడు జరగబోయేది ఏంటో?

మళ్లీ విష్ణుకు ఓటమే

ఈ బరువైన సంచి టాస్కుకు హరితేజ సంచాలకురాలిగా వ్యవహరించింది. టాస్క్ చివర్లో టేబుల్‌పై బ్యాగ్‌ను పడేసే సమయానికి ఒకరి బ్యా్గ్‌ను మరొకరు లాక్కోవడానికి ప్రయత్నించారు కంటెస్టెంట్స్. అయితే టేబుల్‌‌పై పడిన బ్యాగ్‌ను లాక్కోవడానికి వీలులేదని బిగ్ బాస్ ప్రకటించారు. అందుకే టేబుల్‌పై పడకుండా మిస్ అయిన బ్యాగ్స్‌ను లాక్కోవడం మొదలుపెట్టారు కంటెస్టెంట్స్. అలా చివరి వరకు విష్ణుప్రియా బాగానే ఆడింది అనిపించినా ఫైనల్‌గా ప్రేరణ విన్ అయ్యిందని సంచాలకురాలు హరితేజ ప్రకటించింది. మొత్తానికి మెగా చీఫ్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్నందుకు ప్రేరణ తెగ సంతోషపడిపోయింది. ఇప్పటికే ఎన్నోసార్లు మెగా చీఫ్ అవ్వాలనుకున్నా ఓడిపోతూనే ఉంది. ఇదే సమయంలో బిగ్ బాస్ తనకు ఒక పరీక్ష కూడా పెట్టాడు.

రిస్క్ తీసుకున్న ప్రేరణ

మెగా చీఫ్ కంటెండర్ అవ్వడంతో తనకు దక్కిన ఆరెంజ్ బాక్స్‌ను ఓపెన్ చేసి చూసింది ప్రేరణ. అందులో రూ.1,00,000 ఉంది. అంటే ప్రేరణ తన తరపు నుండి రూ. 1 లక్షను విన్నర్స్ ప్రైజ్ మనీకి యాడ్ చేసింది. ఇంతలోనే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చారు. ‘‘గార్డెన్ ఏరియాలో ఒక మిస్టరీ బాక్స్ పెట్టి ఉంది. మీరు కావాలంటే ఆ సూట్‌కేసును తెరవచ్చు. అందులో ఇప్పుడు మీకు వచ్చిన డబ్బులకంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు’’ అని బిగ్ బాస్ తెలిపారు. అందులో ఎంత డబ్బు ఉందో తెలియకపోయినా.. మిస్టరీ బాక్స్‌నే తెరవాలని ప్రేరణ డిసైడ్ అయ్యింది. దానికి ఇతర కంటెస్టెంట్స్ కూడా ఎంకరేజ్ చేశారు. ఇంతకీ అందులో ఎంతుందో తెలియాంటే ఎపిసోడ్ చూడాల్సిందే.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×