Ram Charan.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ (Ram Chara) .. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్(RRR) సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ప్రముఖ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి రేసులో నిలిచి జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టగా.. అందులో భాగంగానే రామ్ చరణ్ ఆహా ఓటీటీ లో ప్రసారమవుతున్న “అన్ స్టాపబుల్ షో” కి హాజరయ్యారు. తాజాగా ఈ సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ ఇప్పుడు ఆహా ఓటీటీ లో ప్రసారం అవుతోంది. మెగా, నందమూరి హీరోల స్పెషల్ ఎపిసోడ్ కావడంతో అభిమానులు కూడా ఈ ఎపిసోడ్ ను చాలా ఆసక్తిగా చూస్తున్నారు.
బాలయ్య షోలో రామ్ చరణ్ తల్లి, నానమ్మ మాట్లాడిన వీడియో..
ఇకపోతే ఈ షోలో రామ్ చరణ్ ఎన్నో విషయాలు పంచుకున్నారు. అలాగే తల్లి సురేఖ(Surekha ), నానమ్మ అంజనాదేవి (Anjana Devi) మాట్లాడిన ఒక వీడియోని కూడా షోలో ప్లే చేశారు. ఈ వీడియోలో వీరిద్దరూ మాట్లాడుతూ..” చరణ్ కి నానమ్మ చేసే చేపల పులుసు అంటే ఎంతో ఇష్టం. అలాగే కిళ్లీ అంటే మరింత ఇష్టం. చిన్నప్పుడు తినకూడదు అని చెప్పినా సరే రహస్యంగా కిళ్లీ తినేవాడు. మా ఇద్దరికీ ఫైటింగ్ కూడా పెట్టేవాడు. సరదాగా ఒకరి మీద మరొకరికి చాడీలు కూడా చెప్పేవాడు” అంటూ తెలిపారు. మొత్తానికైతే రామ్ చరణ్ కి తన నానమ్మ అంజనాదేవి చేసే చేపల పులుసు అంటే చాలా ఇష్టమని తెలియజేశారు.
నానమ్మతో ఉండే బాండింగ్ అదే..
అలాగే షో లో నానమ్మతో తనకు ఉండే ఎమోషన్ బాండింగ్ గురించి కూడా రామ్ చరణ్ మాట్లాడారు. రాంచరణ్ మాట్లాడుతూ..” నానమ్మ మా దగ్గరే ఉంటుంది. షూటింగ్ దగ్గర్లో ఉంటే మాత్రం లంచ్ కి నేను ఇంటికి వచ్చేస్తాను. నానమ్మతో కలిసి భోజనం చేస్తాను. ఆ అరగంటసేపు నేను ఆమెతో గడుపుతాను. ఆమెకు వచ్చిన పాత రెసిపీలు అన్నీ కూడా మాతో షేర్ చేసుకుంటుంది. ముఖ్యంగా నేను, మా నానమ్మ మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటాము. నానమ్మ కూడా ఇప్పటి జనరేషన్ లాగా ఆలోచిస్తుంది. సరదాగా అమ్మకి, నాన్నమ్మకి అత్తా కోడళ్ళ మధ్య ఉండే ఫైటింగ్స్ కూడా నేను పెడతాను” అంటూ తెలిపారు రామ్ చరణ్. మొత్తానికి అయితే తన కుటుంబ విషయాలను కూడా బయట పెట్టి అందరిని నవ్వించారు రామ్ చరణ్. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ(Kiara advani), అంజలి (Anjali)హీరోయిన్లుగా నటిస్తున్నారు.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో దిల్ రాజు (Dilraju) ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మరి ఎన్నో అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి .